విధాత: ఇటీవలి జనరల్ ఎన్నికల్లో ఓడిపోయి, పదవి నుంచి దిగిపోనున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ (PM Sanna Marin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్ల తన వివాహ బంధానికి ముగింపు పలకనున్నట్లు తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అయితే తాను, తన భర్త మార్కస్ రాయిక్కొనెన్ స్నేహితుల్లా కలిసే ఉంటామని ఆమె పేర్కొన్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉండగా.. తాము ముగ్గురం ఒక కుటుంబంలా అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటామని తెలిపారు. ప్రస్తుతం 37 ఏళ్ల […]
విధాత: ఇటీవలి జనరల్ ఎన్నికల్లో ఓడిపోయి, పదవి నుంచి దిగిపోనున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ (PM Sanna Marin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్ల తన వివాహ బంధానికి ముగింపు పలకనున్నట్లు తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
అయితే తాను, తన భర్త మార్కస్ రాయిక్కొనెన్ స్నేహితుల్లా కలిసే ఉంటామని ఆమె పేర్కొన్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉండగా.. తాము ముగ్గురం ఒక కుటుంబంలా అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటామని తెలిపారు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న సనా.. 2019లో ప్రధాని పదవి చేపట్టి ప్రపంచంలోనే చిన్న వయసులో ఆ పదవికి చేరుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు.
మధ్యేవాద వామపక్ష కూటమికి నేతృత్వం వహించి.. ప్రధానిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఫిన్లాండ్ను నాటో కూటమిలో చేర్చడంలో ఆమె విజయం సాధించడం ద్వారా దేశంలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే ఇటీవల జరిగిన జనరల్ ఎన్నికల్లో సనాకు చెందిన సోషల్ డెమోక్రాట్స్ 200 స్థానాలకు కేవలం 43 సీట్లనే గెలుచుకుంది.