Vande Bharath Express | వందేభార‌త్ రైలులో మంట‌లు

Vande Bharath Express బ్యాట‌రీ బ్యాక్స్‌లో చెల‌రేగిన మంట‌లు, పొగ‌ కుర్వాయి కెథోరా రైల్వేస్టేష‌న్‌లో నిలిచిన రైలు ఆ స‌మ‌యంలో బోగిలో 22 మంది ప్ర‌యాణికులు విధాత‌: భోపాల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ టెర్మినల్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో సోమ‌వారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ప్ర‌మాద‌ స‌మ‌యంలో బోగిలో సుమారు 20-22 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవ‌రికీ […]

  • Publish Date - July 17, 2023 / 01:50 AM IST

Vande Bharath Express

  • బ్యాట‌రీ బ్యాక్స్‌లో చెల‌రేగిన మంట‌లు, పొగ‌
  • కుర్వాయి కెథోరా రైల్వేస్టేష‌న్‌లో నిలిచిన రైలు
  • ఆ స‌మ‌యంలో బోగిలో 22 మంది ప్ర‌యాణికులు

విధాత‌: భోపాల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ టెర్మినల్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో సోమ‌వారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ప్ర‌మాద‌ స‌మ‌యంలో బోగిలో సుమారు 20-22 మంది ప్రయాణికులు ఉన్నారు.

అయితే ఈ ఘటనలో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని స‌మాచారం. అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌న‌స్థ‌లానికి చేరి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంట‌లు చెల‌రేగుతుండ‌గా, మ‌రో వైపు ప్రయాణికులు కింద‌కు దూకుతున్న వీడియో షోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భార‌త రైల్వే అధికారుల క‌థ‌నం ప్ర‌కారం… రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన వందేభార‌త్ రైలోని ఒక బోగిలోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు వ్యాపించాయి. త‌క్ష‌ణ‌మే ఆ బోగిలోని ప్ర‌యాణికుల‌ను మ‌రో బోగీలోకి త‌ర‌లించారు. అగ్నిమాప‌క సిబ్బంది స‌కాలంలో స్టేష‌న్‌కు చేరుకొని మంట‌ల‌ను ఆర్పివేశారు. అన్ని త‌నిఖీల అనంత‌రం ఉద‌యం 10.05 గంట‌ల‌కు రైలు తిరిగి ఢిల్లీకి బ‌య‌లు దేరింది.

“రాణి కమలాపతి స్టేషన్ నుంచి బ‌య‌లుదేరిన కాసేప‌టికే ఉద‌యం 6.45 గంట‌ల ప్రాంతంలో వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్-20171 రైలులోని సీ-14 బోగిలోని బ్యాట‌రీ బ్యాక్స్ మంట‌లు, పొగ వ్యాపిస్తున్న‌ద‌ని స‌మాచారం అందింది. రైలును కుర్వాయి కేథోరా (రైల్వే) స్టేషన్‌లో నిలిపివేశారు. అగ్నిమాపక దళం ఉదయం 7:58 గంటలకు మంటలను ఆర్పింది” అని పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్వో రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు.