దేశంలో తొలి సోలార్ విద్యుత్ గ్రామం ఏదంటే!

విధాత: దేశంలోని తొలి సోలార్ గ్రామంగా గుజ‌రాత్ రాష్ట్రంలోని మొధేరా నిలిచింది. శుక్ర‌వారం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ తర్వ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. దేశంలోనే నిరంత‌ర సోలార్ విద్యుత్‌ గ్రామంగా మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు సూర్య‌దేవాల‌యం ఉన్న గ్రామంగా మొధేరా తెలుస‌ని, ఇప్పుడు దేశ ప్ర‌జ‌లంతా దీన్ని సూర్య‌ దేవాల‌యం గ్రామంగా గుర్తిస్తార‌న్నారు. కులం చూడ‌కుండా రెండు ద‌శాబ్దాలుగా గుజ‌రాత్ ప్ర‌జ‌లు త‌న‌ను ఆశ్వీర్వ‌దించార‌ని ప్ర‌ధాని […]

  • By: krs    latest    Oct 09, 2022 5:36 PM IST
దేశంలో తొలి సోలార్ విద్యుత్ గ్రామం ఏదంటే!

విధాత: దేశంలోని తొలి సోలార్ గ్రామంగా గుజ‌రాత్ రాష్ట్రంలోని మొధేరా నిలిచింది. శుక్ర‌వారం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ తర్వ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. దేశంలోనే నిరంత‌ర సోలార్ విద్యుత్‌ గ్రామంగా మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టివ‌ర‌కు సూర్య‌దేవాల‌యం ఉన్న గ్రామంగా మొధేరా తెలుస‌ని, ఇప్పుడు దేశ ప్ర‌జ‌లంతా దీన్ని సూర్య‌ దేవాల‌యం గ్రామంగా గుర్తిస్తార‌న్నారు. కులం చూడ‌కుండా రెండు ద‌శాబ్దాలుగా గుజ‌రాత్ ప్ర‌జ‌లు త‌న‌ను ఆశ్వీర్వ‌దించార‌ని ప్ర‌ధాని అన్నారు.

దేశంలో విరివిగా ఉన్న స‌హ‌జ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకుని పున‌రుత్పాద‌క ఇంధ‌నాన్ని మ‌రింత ప్రోత్స‌హించ‌డం ద్వారా ప్ర‌పంచానికి ఇంధ‌న ప్ర‌దాత‌గా మార‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. మొహ‌సానా ప్ర‌జ‌లు గ‌తంలో నీళ్లు, విద్యుత్ కోసం గ‌తంలో అనేక అవ‌స్త‌లు ప‌డ్డారని మోడీ గుర్తు చేశారు.

మ‌హిళ‌లు నీళ్ల కోసం చాలా దూరం న‌డ‌వాల్సి వ‌చ్చేద‌ని తెలిపారు. కానీ ప్ర‌స్తుత త‌రానికి ఆ బాధ‌లు లేవ‌న్నారు. మంచి ప్ర‌భుత్వ పాల‌న‌కు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించ‌డం, ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్స‌హించ‌డం, క‌నెక్టివిటీని పెంచ‌డం వంటివి చేయ‌గ‌లుగుతుంద‌న్నారు. అప్పుడే స్థిరమైన అభివృద్ధి ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లుగుతామ‌న్నారు.