Hyderabad | మా భర్తను వెతికి పెట్టండి సార్.. ఐదుగురు భార్యలు ఫిర్యాదు
Hyderabad | అతను ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు. ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ఐదుగురిని వివాహామాడాడు. వారితో కొన్నాళ్లు కాపురం చేశాక.. వారితో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించి పరార్ అవడం అతనికి అలవాటుగా మారింది. దీంతో బాధిత భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్లోనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, సనత్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఓ వ్యక్తి వల వేశాడు. మొదట ఒకర్ని […]

Hyderabad | అతను ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు. ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ఐదుగురిని వివాహామాడాడు. వారితో కొన్నాళ్లు కాపురం చేశాక.. వారితో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించి పరార్ అవడం అతనికి అలవాటుగా మారింది. దీంతో బాధిత భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్లోనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, సనత్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఓ వ్యక్తి వల వేశాడు. మొదట ఒకర్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ఐదుగురిని వివాహం చేసుకుని, వేర్వేరుగా కాపురాలు పెట్టాడు. వారితో మోజు తీరాక.. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, బంగారం తీసుకొని పారిపోయాడు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన భార్యలు.. వివిధ పోలీసు స్టేషన్లలో అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులపై పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురిని పెళ్లి చేసుకున్నది ఒకే వ్యక్తి అని తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఐదుగురు భార్యలు కూడా ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో చీటింగ్ మొగుడి కోసం వెతుకుతున్నారు.