CBI మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి.. CM KCR దిగ్భ్రాంతి

అధికారిక లాంఛ‌నాతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.. ఏర్పాట్లు చూడాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆదేశాలు.. విధాత‌: సి.బి.ఐ.(CBI) మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి గా పనిచేసిన కె.విజయరామారావు(VIJAYA RAMARAO) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో […]

CBI మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి.. CM KCR దిగ్భ్రాంతి
  • అధికారిక లాంఛ‌నాతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం..
  • ఏర్పాట్లు చూడాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆదేశాలు..

విధాత‌: సి.బి.ఐ.(CBI) మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రి గా పనిచేసిన కె.విజయరామారావు(VIJAYA RAMARAO) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.