BRSలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్

విధాత: భార‌త్ రాష్ట్ర స‌మితిలో ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ చేరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గిరిధ‌ర్ గ‌మాంగ్‌కు బీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గిరిధ‌ర్‌తో పాటు ఒడిశాకు చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి […]

  • By: krs    latest    Jan 27, 2023 2:47 PM IST
BRSలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్

విధాత: భార‌త్ రాష్ట్ర స‌మితిలో ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ చేరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గిరిధ‌ర్ గ‌మాంగ్‌కు బీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గిరిధ‌ర్‌తో పాటు ఒడిశాకు చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. మాజీ సీఎం గిరిధ‌ర్ గమాంగ్, ఆయ‌న కుమారుడు ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు.

2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. గ‌మాంగ్ కోరాపూట్‌, ల‌క్ష్మీపూర్ స్థానాల‌ నుంచి 9 సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ 1999లో ఎంపీగా వ్యవహరించారు.