Gaddar | ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ ఔట్‌.. KA పాల్‌ ఆదేశాలతో సస్పెన్షన్‌ వేటు

Gaddar పార్టీ జనరల్‌ సెక్రటరీ మమతా రెడ్డి ప్రకటన విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ మమతారెడ్డి ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ ఆదేశాలతోనే గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. గతకొంత కాలంగా గద్దర్‌ (గుమ్మడి విఠల్‌ రావు) పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతుండటంతోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ‘‘గద్దర్‌ ప్రజా […]

  • Publish Date - June 21, 2023 / 12:41 PM IST

Gaddar

  • పార్టీ జనరల్‌ సెక్రటరీ మమతా రెడ్డి ప్రకటన

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ మమతారెడ్డి ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ ఆదేశాలతోనే గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

గతకొంత కాలంగా గద్దర్‌ (గుమ్మడి విఠల్‌ రావు) పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతుండటంతోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ‘‘గద్దర్‌ ప్రజా పార్టీ’’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు బుధవారం గద్దర్‌ ప్రకటించిన సంగతి విదితమే.