‘గాలి’ కొత్త పార్టీ.. వైసీపీకి అనుబంధమా?
విధాత: ఏ పత్రికలోనూ నిలవలేక.. ఉజ్జోగం నిలుపుకోలేక సొంత పత్రిక పెట్టేసి ఎడిటర్ అయిపోయినట్లు ఏ పార్టీలోనూ ప్రాధాన్యం దక్కని కొందరు పెద్ద తలకాయలు సొంత పార్టీ పెట్టేసి ఏకంగా పార్టీ అధ్యక్షులు అవుతున్నారు.. అందులో ఎన్నికల్లో నిలిచి.. గెలిచి.. పార్టీని కొన్నేళ్ల పాటు నడిపే వాళ్ళు కొందరైతేతే మఘలో పుట్టి పుబ్బలో కునికేసినట్లు అయినవాళ్ళు ఇంకొందరు. ఇదిగో ఎన్నికల సీజన్ రావడంతో కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి […]

విధాత: ఏ పత్రికలోనూ నిలవలేక.. ఉజ్జోగం నిలుపుకోలేక సొంత పత్రిక పెట్టేసి ఎడిటర్ అయిపోయినట్లు ఏ పార్టీలోనూ ప్రాధాన్యం దక్కని కొందరు పెద్ద తలకాయలు సొంత పార్టీ పెట్టేసి ఏకంగా పార్టీ అధ్యక్షులు అవుతున్నారు.. అందులో ఎన్నికల్లో నిలిచి.. గెలిచి.. పార్టీని కొన్నేళ్ల పాటు నడిపే వాళ్ళు కొందరైతేతే మఘలో పుట్టి పుబ్బలో కునికేసినట్లు అయినవాళ్ళు ఇంకొందరు.
ఇదిగో ఎన్నికల సీజన్ రావడంతో కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీతో ప్రజల్లోకి వెళుతున్నారు.గతంలో బీజేపీలో ఉంటూ మైనింగ్ కింగ్‌గా చెలామణీ అయిన ఈయన ఇప్పుడు బీజేపీలో అప్రాధాన్య పొజిషన్లో ఉండలేక పార్టీకి రాజీనామా చేసి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.
జగన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న ‘గాలి’ వైసీపీకి అనుబంధంగా కర్ణాటకలో కొనసాగుతారన్న చర్చ సాగుతోంది. వైసీపీ కూడా కర్ణాటకలో విస్తరణ దిశగా కసరత్తు చేస్తోందని సమాచారం. ఇక ఇటీవలే బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ కూడా కర్ణాటకలో పోటీపై క్లారిటీతో ఉన్నారు. దీంతో గాలిని ముందు పెట్టి కేసీఆర్ ఏమైనా చక్రం తిప్పుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గాలి కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి తన సొంత పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP)’ను ప్రారంభించనున్నట్లు తేలడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. గాలికి అత్యంత సన్నిహితుడు గతంలో బుడా చైర్మన్‌గా పనిచేసిన కురుబ కులం నేతను దీనికి అధ్యక్షుడిగా పెట్టబోతున్నట్టు సమాచారం.
తన రాజకీయ కొత్త పార్టీని ప్రకటించేందుకు కొప్పల్ జిల్లాలోని గంగావతిలో మెగా ర్యాలీ నిర్వహించ నున్నట్లు వారు తెలిపారు. అయితే కొత్త పార్టీ పెట్టే విషయమై ఇప్పటి వరకు ‘గాలి’ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పార్టీ కనీసం 25 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. బళ్లారి విజయనగరం కొప్పల్ రాయచూర్ యాదగిరి బీదర్ జిల్లాల్లో గాలి జనార్ధన్ రెడ్డికి భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. మున్ముందు ఈ పార్టీ గమనం ఎటు .. ఎలా ఉంటుందో చూడాలి