Gambhir | క్రికెటర్ అయినందుకు చాలా సిగ్గు పడుతున్నా.. అంత మాట అనేశాడేంటి..!
Gambhir | మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా జట్టు రెండు వరల్డ్ కప్స్ గెలుచుకోగా, ఆ రెండు వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచి జటటు విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసిన గౌతమ్ గంభీగర్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయం పోషించడంలో ముఖ్య భూమిక పోషించాడు. […]

Gambhir |
మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా జట్టు రెండు వరల్డ్ కప్స్ గెలుచుకోగా, ఆ రెండు వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచి జటటు విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసిన గౌతమ్ గంభీగర్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయం పోషించడంలో ముఖ్య భూమిక పోషించాడు.
అతని అంతర్జాతీయ క్రికెట్ 13 ఏళ్లకి పైగా సాగగా, ఇందులో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ మొత్తంగా 10 వేలకు పైగా పరుగులు చేయగాచ, ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీగా ఉన్న గౌతమ్ గంభీర్ అప్పుడప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా హోస్ట్ గంభీర్ ని పలు ప్రశ్నలు అడగగా, అందుకు గంభీర్ సమాధానం ఇస్తూ.. ‘నా జీవితంలో పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఏదైనా ఉందా అంటే అది.. నేను క్రికెటర్ అవ్వడమే.
నేను క్రికెటర్ కాకుండా ఉండాల్సింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతమ్ గంభీర్. భారత జట్టు సాధించిన చాలా విజయాలలో కీలక పాత్ర పోషించిన గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికి నచ్చడం లేదు. ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్‌కి గౌతమ్ గంభీర్ అంటే ఏ మాత్రం మింగుడుపడదు. అందుకే తాను ఇలాంటి కామెంట్స్ చేశాడా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
ఎంతో మంది సారథ్యంలో క్రికెట్ ఆడిన గంభీర్ తన బెస్ట్ కెప్టెన్ ఎవరంటే అనిల్ కుంబ్లే అని బదులు ఇచ్చాడు.. ధోనీ, కోహ్లీ పేర్లను ప్రస్తావించకపోగా, తన ఫేవరేట్ బ్యాటర్ యువరాజ్ సింగ్ అని తెలియజేశాడు. ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకునే గంభీర్.. ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోనే కొనసాగించాలని తెలిపాడు.
కేఎల్ రాహుల్ కోసం ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడం ఏ మాత్రం సరికాదంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల పేర్ల కంటే ఫామ్ ముఖ్యమని ఆయన తెలియజేశారు. ఏదేమైన గౌతమ్ గంభీర్ కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.