స్టాండింగ్ కమిటీ లో 16 అంశాలకు ఆమోదం

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది

  • Publish Date - March 13, 2024 / 01:41 PM IST

విధాత‌: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. స‌మావేశ వివ‌రాల‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీడియాకు తెలియ‌జేస్తూ మొత్తం 17 అంశాలలో 16 అంశాల కు కమిటీ ఆమోదం తెలిపింద‌న్నారు.

జీహెచ్ ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదించిన అంశాలు ఇవి…

1. జీహెచ్ఎంసీ లో అవుట్‌సోర్సింగ్, రెగ్యులర్ సిబ్బంది హాజరు పరిశీలనకొరకు మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ (ముఖగుర్తింపు) బయోమెట్రిక్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్(FR BAMS) సిస్టమ్ ను అమలు చేయడానికి, ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ఆహ్వానించడానికి ఆమోదం.

2. “ఆర్ సి పురం రాయ సముద్రం ట్యాంక్ మిషన్ కాకతీయ లో కవర్ గానీ ఇంటెక్-1 నుండి ఇంటెక్-2 వరకు డ్రైనేజీ మళ్లింపు పని కోసం I&D పనులను చేపట్టు కోసం 2,52,30,000/-కు పరిపాలన మంజూరితో టెండర్ పిలవడానికి కమిటీ ఆమోదం.

3. “రూ. 5/- లకు అన్నపూర్ణ భోజన పథకానికి సంబంధించి ప్రస్తుత ఏజెన్సీ M/s. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్‌తో ఒప్పందం పూర్తి అయినందున మరో రెండు సంవత్సరాలు పొడగింపుకు ఎం.ఓ.యు చేసుకొనుటకు, కమిటీ ఆమోదం.

4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి ఉద్యోగులకు 01.01.2022 నుండి మంజూరు చేసిన 2.73%, (20.02% నుండి 22.75% వరకు) పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ ఉత్తర్వులను స్టాండింగ్ క‌మిటీ సమాచారం.

5. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ననుసరించి పెన్షనర్‌లకు ప్రాథమిక పెన్షన్‌లో 01.01.2022 నుండిపెంచిన డిఏ ఉత్తర్వులను (20.02% నుండి 22.75% వరకు) స్టాండింగ్ కమిటీ కి సమాచారం.

6. తెలంగాణ ప్రభుత్వం G.O.Ms నం. 133 తేదీ. 02.10.2023, ద్వారా ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 01.10.2023 నుండి 5% ఐ.ఆర్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్టాండింగ్ కమిటీ సమాచారం.

7. బేగంపేట్ ROB కోసం బేగంపేట్ రైల్వే స్టేషన్‌ వద్దమరమ్మత్తులు, పునరుద్దరణ పనులకు రూ.20.00 కోట్ల అంచనా మొత్తానికి పరిపాలనా అనుమతికి, కమిటీ ఆమోదం.

8. సికింద్రాబాద్ రామ కిష్టాపురం రైల్వే స్టేషన్ వద్ద RK పురం ROB పునరుద్ధరణ చర్యలకు రూ. 6.00 కోట్ల అంచనా మొత్తానికి పరిపాలన అనుమతి కి కమిటీ ఆమోదం.

9. LB నగర్ , చుట్టుపక్కల (ప్యాకేజీ-II) నాలుగు జంక్షన్ లో మల్టీలెవల్ ఫ్లైఓవర్/ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి రివైజ్డ్ అంచనా వ్యయం (అసలు మొత్తం 448.00 కోట్ల కు అదనంగా రూ.67.00కోట్లు) మొత్తం రూ.550 కోట్లకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.

10. యూసుఫ్‌గూడ, వెంగల్‌రావు నగర్ డివిజన్‌లలో యూసుఫ్‌గూడబస్తీ జంక్షన్ అభివృద్ధికి అంచనా రూ.4.90 కోట్లకు పరిపాలన అనుమతి కి, ఇ-టెండర్లు పిలవడానికి అనుమతి కి కమిటీ ఆమోదం.

11. శేరిలింగంపల్లి పల్లి సర్కిల్ 19 రహ్మత్ నగర్ డివిజన్, రహ్మత్ నగర్ PJR విగ్రహం జంక్షన్ అభివృద్ధి” అంచనా మొత్తం రూ.5.17కోట్లకు పరిపాలన అనుమతి, ఇ-టెండర్లను కలవడానికి కమిటీ ఆమోదం.

12. చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ ద్వారా ఫిబ్రవరి, 2024 మాస ఆదాయ, వ్యయ నివేదిక ను సమర్పించారు.

13. KPHB కాలనీ, వార్డు నెం.114, మూసాపేట్ సర్కిల్ లో మెస్సర్స్ లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వంత నిధులతో ఇప్పటికే ఉన్న రహదారి వెడల్పు పెంచుటకు కమిటీ ఆమోదం.

14. శేరిలింగంపల్లి జోన్ చందానగర్ పీజేఆర్ స్టేడియం, చార్మినార్ జోన్, మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ (2) ప్లే గ్రౌండ్‌లలో ఉచిత శిక్షణకుCSR కింద పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ కు (12)నెలల కు ఒప్పందం చేసుకొనుటకు కమిషనర్ కు అనుమతినిస్తూ కమిటీ ఆమోదం.

టేబుల్ ఐటమ్స్

15. బాలాజీ నగర్ నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఓపెన్ ల్యాండ్ వరకు 599 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ( బాక్స్ డ్రైన్)వరద నీటి కాలువ నిర్మాణానికి కమిటీ ఆమోదం.

16. బంజారా హిల్స్ లో వైకుంఠ మహాప్రస్థానం స్మశాన వాటిక సి ఎస్ ఆర్ పద్దతిలో మూడు సంవత్సరాల పాటు నిర్వహణ చేయుటకు మెసర్స్ ఫెనిక్స్ ఫౌండేషన్ సంస్థతో ఒప్పందం చేసుకొనుటకు అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదం.

సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, ఫాహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దత్, మొహమ్మద్ ఖాదర్, పొడవు అర్చన, మహమ్మద్ నసీర్ ఉద్దీన్, గౌస్ ఉద్దీన్ మహమ్మద్, ఉప్పలపతి శ్రీకాంత్, సబీహా బేగం, ఆవుల రవీందర్ రెడ్డి, చింతల విజయ శాంతి, కంది శైలజ పాల్గొనగా, కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, శ్రీవాత్సవ, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్,సి.ఈ లు దేవానంద్, కిషన్, అడిషనల్ కమిషనర్లు గీతా మాధురి, చంద్రకాంత్ రెడ్డి,జయరాజ్ కెన్నెడీ, డాక్టర్ సునంద ,జోనల్ కమిషనర్లు అభిలాష అభినవ్,స్నేహ శబరీష్, రవికిరణ్, వెంకన్న, ముకుందరెడ్డి, సిసిసి రాజేంద్ర ప్రసాద్ నాయక్, అకౌంట్స్ ఎగ్జామినర్ వెంకటేశ్వరరెడ్డి, ఎంటమాలజీ డా.రాంబాబు,సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, కార్యదర్శి దశరథ్, తదితరులు పాల్గొన్నారు.