వెకేష‌న్‌లో బాయ్‌ఫ్రెండ్.. ఎగ్జామ్స్‌ రాసిన గ‌ర్ల్ ఫ్రెండ్..

Gujarat | చాలా మంది ప్రేమికులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతే కాదు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరు. ఏ ఒక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా.. దాన్ని త‌న‌దిగానే భావించి, ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తారు. ఆ మాదిరిగానే బాయ్ ఫ్రెండ్ రాయాల్సిన ఎగ్జామ్‌ను త‌ను రాసి ఇన్విజిలేట‌ర్ల‌కు అడ్డంగా దొరికిపోయింది ఓ యువ‌తి. సినిమాల్లో ఒక‌రికి బ‌దులు మ‌రొకరు ఎగ్జామ్ రాసిన‌ట్లే.. తాను కూడా రాద్దామ‌నుకుంది.. కానీ ఇన్విజిలేట‌ర్ల కంట ప‌డిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌లో డిగ్రీ విద్యార్థుల‌కు […]

  • Publish Date - December 26, 2022 / 02:37 AM IST

Gujarat | చాలా మంది ప్రేమికులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతే కాదు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరు. ఏ ఒక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా.. దాన్ని త‌న‌దిగానే భావించి, ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తారు. ఆ మాదిరిగానే బాయ్ ఫ్రెండ్ రాయాల్సిన ఎగ్జామ్‌ను త‌ను రాసి ఇన్విజిలేట‌ర్ల‌కు అడ్డంగా దొరికిపోయింది ఓ యువ‌తి. సినిమాల్లో ఒక‌రికి బ‌దులు మ‌రొకరు ఎగ్జామ్ రాసిన‌ట్లే.. తాను కూడా రాద్దామ‌నుకుంది.. కానీ ఇన్విజిలేట‌ర్ల కంట ప‌డిపోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌లో డిగ్రీ విద్యార్థుల‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఓ యువ‌కుడు వెకేష‌న్ నిమిత్తం ఉత్త‌రాఖండ్ వెళ్లాడు. అత‌ను బీకామ్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. వెకేష‌న్‌లో ఉన్న కార‌ణంగా అత‌ను ఆ ఎగ్జామ్‌కు అటెండ్ కాలేక‌పోతున్న‌ట్లు త‌న ప్రియురాలికి చెప్పాడు.

దీంతో ఆ జంట.. కంప్యూట‌ర్ సాయంతో హాల్‌టికెట్‌లో మార్పులు చేశారు. అత‌ని ఫోటో, పేరుకు బ‌దులుగా ప్రియురాలి ఫోటో, పేరు మార్చారు. ఇంకేముంది ద‌ర్జాగా ఎగ్జామ్స్‌కు అటెండ్ అవుతూ వ‌చ్చింది.

కానీ ఒక ఎగ్జామిన‌ర్‌కు డౌట్ వ‌చ్చింది. అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చోని ఎగ్జామ్ రాయ‌డం ఏంట‌ని అనుమానం రావ‌డంతో.. త‌క్ష‌ణ‌మే ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. నామిన‌ల్ రూల్‌లో ఉన్న ఫోటో, హాల్ టికెట్‌లో ఉన్న ఫోటోలో తేడాలున్నాయి.

దీంతో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా, జ‌రిగిన విష‌యం చెప్పింది. త‌న బాయ్ ఫ్రెండ్ వెకేష‌న్‌లో ఉన్నందునే, అత‌ని స్థానంలో తాను ఎగ్జామ్స్ రాస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆమె స‌మాధానం విన్న కాలేజీ సిబ్బంది షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News