విధాత: అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అతనితోనే తన జీవితమని కలల ప్రపంచంలో తేలియాడుతుంది. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని ప్రారంభిద్దామనుకుంది.. కానీ ప్రియుడు మాత్రం మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు ప్రియుడు ఇంటికి నిప్పంటించింది. ఈ ఘటన Americaలోని టెక్సాస్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌కు చెందిన సేనాదియా మేరీ సాటూ కొన్నెండ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడు. ఇద్దరు కలిసి షికార్లకు వెళ్లడం మొదలెట్టారు. ఇక త్వరలోనే ఒక్కటి కావాలనుకున్నారు. కానీ ప్రియురాలికి తెలియకుండా మరో అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు ప్రియుడు.
ఐతే ఇటీవలే ప్రియుడికి ఫోన్ చేయగా మరో యువతితో ఉన్నానని చెప్పాడు. దీనితో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడు ఇంటి కెళ్లి దొరికిన కాడికి దోచుకుంది. ఆ తర్వాత ఇంటికి నిప్పంటించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోని మంటలను ఆర్పివేసింది.
ఏ ప్రమాదంతో యాభై వేల డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు మేరీని పోలీసులు అరెస్ట్ చేసి, ఆమెపై దొంగతనం కేసు కూడా నమోదు చేసారు.