Gmail | ఆ మెయిల్స్‌ను డిలీట్‌ చేయనున్న గూగుల్‌..! అవసరమనుకుంటే ఇలా చేయండి మరి..!

Gmail | టెక్‌ దిగ్గం గూగుల్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. రెండేళ్లకుపైగా ఇన్‌ యాక్టివ్‌ జీ మెయిల్స్‌ను డిలీట్‌ చేయనున్నట్లు మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. ఒక్క జీ మెయిల్‌ మాత్రమే కాకుండా యూజర్‌కు సంబంధించిన యూట్యూబ్‌ అకౌంట్‌ను సైతం డిలీట్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండేళ్లుగా సైన్ఇన్ కాని మెయిల్ అకౌంట్లను తొలగిస్తామని, ఇటీవల తమ బ్లాగ్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే తొలగింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఇన్‌ యాక్టివ్‌లో ఉన్న […]

Gmail | ఆ మెయిల్స్‌ను డిలీట్‌ చేయనున్న గూగుల్‌..! అవసరమనుకుంటే ఇలా చేయండి మరి..!

Gmail | టెక్‌ దిగ్గం గూగుల్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. రెండేళ్లకుపైగా ఇన్‌ యాక్టివ్‌ జీ మెయిల్స్‌ను డిలీట్‌ చేయనున్నట్లు మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. ఒక్క జీ మెయిల్‌ మాత్రమే కాకుండా యూజర్‌కు సంబంధించిన యూట్యూబ్‌ అకౌంట్‌ను సైతం డిలీట్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండేళ్లుగా సైన్ఇన్ కాని మెయిల్ అకౌంట్లను తొలగిస్తామని, ఇటీవల తమ బ్లాగ్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.

త్వరలోనే తొలగింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఇన్‌ యాక్టివ్‌లో ఉన్న అకౌంట్స్‌ను వెంటనే యాక్టివ్‌ చేసుకోవాలని సమాచారం అందించింది. ప్రస్తుతం యాక్టివేట్‌లో లేని జీమెయిల్, యూట్యూబ్ ఖాతాలను గుర్తించే పనిలో గూగుల్ ఉన్నది.

ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి అకౌంట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించనున్నది. యాక్టివ్‌లోలేని ఖాతాలను తొలగించడతో అనవసర భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఆయా అకౌంట్స్‌ను డిలీట్‌ చేస్తే అందులో ఉండే సమాచారం, ఫొటోలు, డాక్యుమెంట్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్‌లోని కంటెంట్‌ అంతా ఆటోమేటిక్‌గా డిలీట్‌ కానున్నాయి.

దశల వారీగా ఖాతాల తొలగింపు

ఇనాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్లు గూగుల్‌ పేర్కొంది. అకౌంట్‌ను క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి సైతం వాడని ఖాతాలను మొదట డిలీట్‌ చేస్తామని తెలిపింది. డిలీట్‌ చేసే ముందు ఆ అకౌంట్‌, ఆ అకౌంట్‌తో పాటు రికవరీ అకౌంట్‌ను డిలీట్‌ చేయబోతున్నట్లు హెచ్చరిస్తూ మెయిల్‌ పంపింది. వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే ఈ తొలగింపు వర్తిస్తుందని, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలకు చెందిన మెయిల్స్‌ ఖాతాలను తొలగించమని స్పష్టం చేసింది.

జీమెయిల్ డిలీట్ కాకుడదంటే ఇలా చేయండి..

ఇనాక్టివ్‌లో ఉన్న జీమెయిల్ ఖాతా డిలీట్ కాకూడదంటే త్వరగా ఈ పనులు పూర్తి చేయండి. వెంటనే ఇనాక్టివ్ మెయిల్‌ అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయాలి. టూ ఫాక్టర్ అథెంటికేషన్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఆ అకౌంట్ నుంచి ఎవరికైనా మెయిల్ చేయాలి. అలాగే గూగుల్‌ డ్రైవ్‌ను ఒకసారైనా వినియోగించండి. ఆ అకౌంట్‌తో లింక్‌ అయిన యూట్యూబ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, ఏవైనా వీడియోలు చూడండి. గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌ను వాడుకోండి. గూగుల్ మెయిల్‌తో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని యాక్టివేట్‌ చేసుకోవాలి.