మగువలకు బిగ్‌ రిలీఫ్‌.. తగ్గిన పసిడి ధరలు..!

పసిడి ధరలు మగువలకు ఊరటనిచ్చాయి. ఇటీవల పెరుగుతూ వస్తున్న ధరలు.. నేడు బులియన్‌ మార్కెట్‌లో స్వల్పంగా దిగి వచ్చాయి.

మగువలకు బిగ్‌ రిలీఫ్‌.. తగ్గిన పసిడి ధరలు..!

విధాత‌: పసిడి ధరలు మగువలకు ఊరటనిచ్చాయి. ఇటీవల పెరుగుతూ వస్తున్న ధరలు.. నేడు బులియన్‌ మార్కెట్‌లో స్వల్పంగా దిగి వచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.200 దిగి రాగా తులం రూ.56,950 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడి రూ.220 దిగి రాగా.. తులం రూ.62,130కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,050 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,280 పలుకుతున్నది.


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,730కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,130కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,130 పలుకుతున్నది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. రూ.200 దిగిరావడంతో కిలోకు రూ.75,800 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలోకు రూ.77,800కి తగ్గింది.