స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి.. నేటి ధరలు ఇవే..!

మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం తగ్గుముఖం పట్టాయి

  • Publish Date - January 26, 2024 / 05:11 AM IST

Gold Rates | మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.50 తగ్గి.. తులం రూ.57,770 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పసిడిపై సైతం రూ.50 తగ్గి.. రూ.62,950 ధర పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,600కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950కి తగ్గింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100కి దిగివచచింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగానే పెరిగింది. రూ.700 పెరిగి కిలోకు రూ.76వేలకు చేరింది.


ప్రస్తుతం హైదరాబాద్‌ వెండి కిలోకు రూ.77,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.