వరుసగా రెండోరోజూ తగ్గిన బంగారం..! నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారం కొనుగోలుదారులకు ధరలు ఊరట కలిగిస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పతనమయ్యాయి

  • Publish Date - January 18, 2024 / 03:31 AM IST

Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ధరలు ఊరట కలిగిస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పతనమయ్యాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు గురువారం మరోసారి తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తులానికి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 తులానికి రూ.63,330 పలుకుతున్నది. అదే సమయంలో వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. రూ.600 తగ్గి కిలోకు రూ.75,900కి దిగివచ్చింది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,100కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,380కి దిగజారింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


ఇక వెండి ధర సైతం భారీగానే తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.600 తగ్గగా రూ.75,900కి దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,400 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.