Gold Rate | బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగొచ్చిన పుత్తడి..! అందేబాటలో వెండి..!

Gold Rate | కొనుగోలుదారుల‌కు బంగారం ధరలు గురువారం ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.450 వరకు తగ్గి రూ.56,300కు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.490 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి ధర సైతం పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,450కు చేరగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.61,570కి తగ్గింది. హైదరాబాద్‍‍లో 22 క్యారెట్లకు […]

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగొచ్చిన పుత్తడి..! అందేబాటలో వెండి..!

Gold Rate | కొనుగోలుదారుల‌కు బంగారం ధరలు గురువారం ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.450 వరకు తగ్గి రూ.56,300కు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.490 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి ధర సైతం పతనమైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,450కు చేరగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.61,570కి తగ్గింది.

హైదరాబాద్‍‍లో 22 క్యారెట్లకు చెందిన తులం పుత్తడి రూ.56,300కి తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.61,420కి చేరింది.

విజయవాడ, విశాఖపట్నంతో సహా తెలుగు రాష్ట్రాలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,982 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

డాలర్‌ ఒడిదొడుకులు, డిమాండ్‌ తగ్గడం, అమెరికా బ్యాకింగ్‌ సంక్షోభం తదితర కారణాలతో బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ పండితులు పేర్కొంటున్నారు.

మరో వైపు వెండి సైతం నేలచూపులు చూస్తున్నది. గురువారం కిలో వెండిపై రూ.500 వరకు తగ్గి రూ.74,600కి తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,200 పలుకుతున్నది.