Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధర.. మరి హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, వడ్డీరేట్ల పెంపునకు సిద్ధంగా ఉన్నామని పావెల్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్‌కు గోల్డ్‌ రేటు 1937 డాలర్లు పలుకుతున్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వస్తున్నా భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,650 ఉండగా.. 24 […]

Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధర.. మరి హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold Rates |

అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, వడ్డీరేట్ల పెంపునకు సిద్ధంగా ఉన్నామని పావెల్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్‌కు గోల్డ్‌ రేటు 1937 డాలర్లు పలుకుతున్నది.

మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వస్తున్నా భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,600 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.59,730 వద్ద స్థిరంగా ఉన్నది.

ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు సైతం రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లోనూ బంగారం ధరలు ఇవే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.79,500కి తగ్గింది.