Gold Rates | అక్షయ తృతీయకు ముందే బంగారం ప్రియులకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

Gold Rates | అక్షయ తృతీయకు ముందే బంగారం ధరలు(Gold Rates) వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నాయి. శుక్రవారం పుత్తడి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర మరోసారి రూ.61వేల మార్క్‌ను ధాటింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.56వేలకు ఎగువన ట్రేడవున్నతది. శనివారం అక్షయ తృతీయ కావడంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. దాంతో బంగారం ధరల మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇక వెండి ధర […]

  • Publish Date - April 21, 2023 / 05:18 AM IST

Gold Rates |

అక్షయ తృతీయకు ముందే బంగారం ధరలు(Gold Rates) వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నాయి. శుక్రవారం పుత్తడి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర మరోసారి రూ.61వేల మార్క్‌ను ధాటింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.56వేలకు ఎగువన ట్రేడవున్నతది.

శనివారం అక్షయ తృతీయ కావడంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. దాంతో బంగారం ధరల మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇక వెండి ధర సైతం స్వల్పంగా పెరిగి.. రూ.81వేలకుపైగా కొనసాగుతున్నది.

శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వలంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ధర రూ.200 పెరిగి రూ.56,050, చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 పెరిగింది. ప్రస్తుతం రూ.61,150కి చేరింది. అలాగే వెండిపై రూ.300 పెరిగి.. రూ.81,300కు చేరింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ బంగారం ధర 2వేల డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర(Gold Rates) 1997.50 డాలర్ల వద్ద, వెండి ధర స్వల్పంగా తగ్గి 25.25 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నది.