Gold-Silver Rates | సామాన్యులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. నేడు మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold-Silver Rates | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులం రూ.55,400 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.310 దిగివచ్చి.. తులానికి రూ.60,440కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,590గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,400కి తగ్గింది. చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి […]

Gold-Silver Rates | సామాన్యులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. నేడు మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold-Silver Rates | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులం రూ.55,400 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.310 దిగివచ్చి.. తులానికి రూ.60,440కి తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,590గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,400కి తగ్గింది.

చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి ధర రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి బంగారం ధర రూ.60,760కి దిగివచ్చింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,440కి తగ్గింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధర భారీగానే తగ్గి కిలోకు రూ.79వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కేజీ ధర రూ.82వేలకు చేరింది.