నీదీ నాదీ ఒకటే పరిస్థితి అమ్మా.. షర్మిలకు గవర్నర్ ఓదార్పు!

పోలీసుల తీరుపై గవర్నర్‌కు షర్మిళ ఫిర్యాదు విధాత: డోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చు. తనను తన ప్రభుత్వమే పట్టించు కోవడం లేదని, కనీస గౌరవం, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని నిత్యం కేసీఆర్ సర్కారు మీద చిందులు తొక్కే గవర్నర్ తమిళ సైని షర్మిళ కలిశారు. తనను పోలీసులు ఏవిధంగా అవమానించిందీ, ఎలా ఇబ్బంది పెట్టిందీ, కారుతో సహా ఎత్తుకొచ్చి అరెస్ట్ చేసింధీ ఏకరువు పెట్టారు. అది సహజమే.. ప్రభుత్వం ఎవరినైనా […]

  • By: krs    latest    Dec 01, 2022 3:20 PM IST
నీదీ నాదీ ఒకటే పరిస్థితి అమ్మా.. షర్మిలకు గవర్నర్ ఓదార్పు!

పోలీసుల తీరుపై గవర్నర్‌కు షర్మిళ ఫిర్యాదు

విధాత: డోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చు. తనను తన ప్రభుత్వమే పట్టించు కోవడం లేదని, కనీస గౌరవం, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని నిత్యం కేసీఆర్ సర్కారు మీద చిందులు తొక్కే గవర్నర్ తమిళ సైని షర్మిళ కలిశారు.

తనను పోలీసులు ఏవిధంగా అవమానించిందీ, ఎలా ఇబ్బంది పెట్టిందీ, కారుతో సహా ఎత్తుకొచ్చి అరెస్ట్ చేసింధీ ఏకరువు పెట్టారు. అది సహజమే.. ప్రభుత్వం ఎవరినైనా ఇబ్బంది పెడితే గవర్నరుకో, మానవ హక్కుల కమిషన్ కో చెప్పుకోవడం సహజం.. కానీ తెలంగాణలో సాక్షాత్తు గవర్నర్ తమిళ సై ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఇబ్బందులు పడుతున్నారు.

తాను భద్రాచలం ఆలయానికి వెళితే కనీసం ప్రోటోకాల్ లేదని ఆమె గతంలో వాపోయారు. వరద ప్రాంతాల పర్యటనకు హెలికాఫ్టర్ అడిగినా నిరాకరించారని వగచారు. ఆమెను బీజేపీ కార్యకర్తగా ట్రీట్ చేస్తున్న కేసీఆర్ సర్కారు ఆమెను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రగతి భవన్‌కు పాదయాత్ర అంటూ బయల్దేరాగా ఆమెను కారుతో సహా క్రేన్లో ఎత్తుకొచ్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ వచ్చింది అది వేరే సంగతి. ఈ పరిణామాల మీద గవర్నరును కలిసి ఆవేదన వెళ్లబుచ్చారు.

నర్సంపేటలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో తమ బస్సును తగలబెట్టి, తమ పార్టీ కార్యకర్తలను కొట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదంటూ షర్మిళ గవర్నర్య కు వివారించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నరే కేసీఆర్ తో నానా అవమానాలు పడుతుండగా ఆమె ఈ షర్మిలకు ఏమి సాయం చేయగలరు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.