YADADRI: బ్రహ్మోత్సవాలకు హాజరైన గవర్నర్ తమిళిసై
వటపత్ర శాయిని సేవించుకున్న గవర్నర్ విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పర్వంలో నాలుగో రోజు శుక్రవారం వటపత్ర శాయిగా అలంకార సేవలు అందుకున్న యాదగిరీషుడిని రాష్ట్ర గవర్నర్ తమిళసై దర్శించుకుని సేవించారు. సృష్టి ఆరంభ వేళ వటపత్ర శాయిగా శ్రీ మహా విష్ణువు కడలి ఒడిలో మర్రి ఆకుపై పసి బాలుడై పవళించి లోకాలను అనుగ్రహించి రక్షించారు. ఉగ్ర నరసింహుడైన యాదగిరీషుడు వటపత్ర శాయిగా చిద్విలాసంతో వేంచేపు మండపంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం సేవలు అందుకొని […]

- వటపత్ర శాయిని సేవించుకున్న గవర్నర్
విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పర్వంలో నాలుగో రోజు శుక్రవారం వటపత్ర శాయిగా అలంకార సేవలు అందుకున్న యాదగిరీషుడిని రాష్ట్ర గవర్నర్ తమిళసై దర్శించుకుని సేవించారు. సృష్టి ఆరంభ వేళ వటపత్ర శాయిగా శ్రీ మహా విష్ణువు కడలి ఒడిలో మర్రి ఆకుపై పసి బాలుడై పవళించి లోకాలను అనుగ్రహించి రక్షించారు.
ఉగ్ర నరసింహుడైన యాదగిరీషుడు వటపత్ర శాయిగా చిద్విలాసంతో వేంచేపు మండపంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం సేవలు అందుకొని తిరుమాడ వీధుల్లో విహరించారు.
గవర్నర్ తమిళసై వటపత్ర శాయి అలంకార , విహార సేవలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వటపత్ర సాయి అలంకారంలోని లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని పులకించారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ అద్భుత శిల్పకళా తో పునర్ నిర్మితమైన నూతన ఆలయంలో జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలకు తాను హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకి లక్ష్మీనరసింహస్వామి ఆరోగ్య సుఖ సంతోషాలను అందించాలని తాను కోరుకున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఆలయానికి విచ్చేసిన గవర్నర్ తమిళసైకి కలెక్టర్ పమేలా సత్పతి,ఈవో గీత, ఆలయ అధికారులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు. సాయంత్రం వాహన సేవలో భాగంగా స్వామివారు హంస వాహనం పై విహరించనున్నారు.