Raj Bhavan | ఏ రాష్ట్రంలో లేని సవాళ్లు.. తెలంగాణ యువ‌తకు ఉన్నాయ్‌| గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంచలన వ్యాఖ్య‌లు

Raj Bhavan | యువ‌త వెంటే రాజ్‌భ‌వ‌న్‌.. ఉగాది వేడుక‌ల్లో గవర్నర్‌  విధాత: తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ (Tamilisai Soundararajan) మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వంపై (Telangana Govt) నిప్పులు చెరిగారు. రాజ్‌భ‌వ‌న్ (Raj Bhavan) వేదిక‌గా నిర్వ‌హించిన ఉగాది (Ugadi) వేడుక‌ల్లో త‌మిళిసై పాల్గొని ప్ర‌సంగించారు. యువ‌త‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువ‌త అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఇన్ని స‌వాళ్లు లేవు. మీకు ఏదైనా స‌మ‌స్య‌లు ఉంటే.. వాటిని […]

Raj Bhavan | ఏ రాష్ట్రంలో లేని సవాళ్లు.. తెలంగాణ యువ‌తకు ఉన్నాయ్‌| గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంచలన వ్యాఖ్య‌లు

Raj Bhavan |

  • యువ‌త వెంటే రాజ్‌భ‌వ‌న్‌.. ఉగాది వేడుక‌ల్లో గవర్నర్‌

విధాత: తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ (Tamilisai Soundararajan) మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వంపై (Telangana Govt) నిప్పులు చెరిగారు. రాజ్‌భ‌వ‌న్ (Raj Bhavan) వేదిక‌గా నిర్వ‌హించిన ఉగాది (Ugadi) వేడుక‌ల్లో త‌మిళిసై పాల్గొని ప్ర‌సంగించారు.

యువ‌త‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువ‌త అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఇన్ని స‌వాళ్లు లేవు. మీకు ఏదైనా స‌మ‌స్య‌లు ఉంటే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఈ తెలంగాణ మీదే. నేను మీకు హామీ ఇస్తున్నాను.. రాజ్‌భ‌వ‌న్ మీ వెంటే ఉంటుంది అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్యాఖ్యానించారు.

ప‌లు సంద‌ర్భాల్లో తాము వీఐపీల‌ను పిలిచిన‌ప్పుడు.. వారు వ‌స్తారో లేదో త‌న‌కు తెలియ‌దని అధికారంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి త‌మిళిసై వ్యాఖ్యానించారు. కానీ.. నేటీ వీఐపీలు యువ‌శ‌క్తి త‌న ఆహ్వానాన్ని గౌర‌వించి, ముందుగానే వ‌చ్చార‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. కాగా గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.