BREAKING: ప‌ది ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

విధాత: ప‌ది ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 6 పేప‌ర్ల‌తోనే ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ అకాడ‌మిక్ ఇయ‌ర్ కూడా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ ప్ర‌తిపాదించింది. ఆ ప్ర‌తిపాద‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆమోదించింది. దీంతో ఇక ఈ ఏడాది కూడా 6 పేప‌ర్ల‌కే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా వైర‌స్‌ కార‌ణంగా 2021లో 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కు కుదిస్తూ […]

  • By: krs    latest    Oct 13, 2022 1:54 PM IST
BREAKING: ప‌ది ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

విధాత: ప‌ది ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 6 పేప‌ర్ల‌తోనే ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ అకాడ‌మిక్ ఇయ‌ర్ కూడా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ ప్ర‌తిపాదించింది. ఆ ప్ర‌తిపాద‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆమోదించింది. దీంతో ఇక ఈ ఏడాది కూడా 6 పేప‌ర్ల‌కే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

క‌రోనా వైర‌స్‌ కార‌ణంగా 2021లో 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. అయితే ఆ ఏడాది క‌రోనా ఉధృతి కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వీలు కాలేదు. ఇక 2022లో విద్యాశాఖ ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌లు నిర్వ‌హించింది.

నాడు 6 పేప‌ర్ల‌కు కుదించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. మ‌ళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ప్ర‌భుత్వం.

గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా నిర్వ‌హించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష నిర్వ‌హించేవారు. కరోనా కార‌ణంగా 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా 6 పేప‌ర్ల‌కే కుదించారు.