గ్రామ గ్రామాన ‘హాత్ సే హాత్ జోడో’.. కార్య‌క‌ర్త‌లు యాత్ర‌కు సిద్ధం కావాల‌ని పిలుపు: ఉత్తమ్

ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను, ఎన్నిక‌ల హామీల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. విధాత: ఏఐసిసి నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు కొనసాగింపుగా పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలను గ్రామగ్రామాన నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం హుజూర్‌న‌గర్‌లో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ […]

  • Publish Date - February 4, 2023 / 04:57 PM IST
  • ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను, ఎన్నిక‌ల హామీల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి..

విధాత: ఏఐసిసి నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు కొనసాగింపుగా పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలను గ్రామగ్రామాన నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం సాయంత్రం హుజూర్‌న‌గర్‌లో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జోడో యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఇటు తెలంగాణలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, ఎన్నికల హామీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. బిజెపి, బిఆర్ఎస్ ల పాలనకు హాత్ సే హాత్ జోడో యాత్రల ద్వారా చరమ గీతం పాడాలన్నారు. హుజూర్‌న‌గర్, కోదాడ నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన జోడో యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనుకూల వాతావరణం ఉందన్నారు.

నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, కేసీఆర్ ప్రభుత్వ విధానాల పైన ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్నారు. హుజూర్‌న‌గర్ ఎమ్మెల్యే భూకబ్జాలు, అవినీతిని, కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలో తెచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్దాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూరి రజిత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.