Hanumanth Rao | పోస్టర్లు వేయకుండా బీఆరెస్ కుట్ర: వీహెచ్
Hanumanth Rao విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ పోస్టర్లు వేయకుండా బీఆరెస్ పార్టీ కుట్ర చేస్తోందని సీనియర్ నేత మాజీ ఎంపీ వి. హన్మంతరావు ఆరోపించారు. మెట్రో పిల్లర్లన్నీ బీఆరెస్, బీజేపీ నేతలు కొనేశారని ఎన్‌వీఎస్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే అనే అంశాన్ని మెట్రో ఎండీ ఎన్వీయస్‌రెడ్డి కి గుర్తుచేశానన్నారు. ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ బొమ్మ కనిపిస్తే మార్పు వస్తుందన్న భయంతో […]

Hanumanth Rao
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ పోస్టర్లు వేయకుండా బీఆరెస్ పార్టీ కుట్ర చేస్తోందని సీనియర్ నేత మాజీ ఎంపీ వి. హన్మంతరావు ఆరోపించారు. మెట్రో పిల్లర్లన్నీ బీఆరెస్, బీజేపీ నేతలు కొనేశారని ఎన్‌వీఎస్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.
కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే అనే అంశాన్ని మెట్రో ఎండీ ఎన్వీయస్‌రెడ్డి కి గుర్తుచేశానన్నారు. ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ బొమ్మ కనిపిస్తే మార్పు వస్తుందన్న భయంతో కాంగ్రెస్ పోస్టర్లకు ఒక్క పిల్లర్ కూడా లేకుండా చేశారన్నారు. అవకాశం ఉన్నంతవరకు పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు.