HARISH RAO | మత్స్యకారుల్లో కొత్త వెలుగులు: మంత్రి హరీశ్ రావు
జిల్లాకు సాగునీరు.. మత్స్య సంపద జిల్లాలోని 28వేల కుటుంబాలకు లబ్ధి క్యాంపు కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ పురోభివృద్ధిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలోని మత్స్యకారుల జీవితాల్లో కొత్త రోజులు వెలుగులు వచ్చాయి. జిల్లాకు సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగిందని జిల్లాలోని రంగనాయక సాగర్, అంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట […]

- జిల్లాకు సాగునీరు.. మత్స్య సంపద
- జిల్లాలోని 28వేల కుటుంబాలకు లబ్ధి
- క్యాంపు కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ పురోభివృద్ధిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలోని మత్స్యకారుల జీవితాల్లో కొత్త రోజులు వెలుగులు వచ్చాయి. జిల్లాకు సాగునీరు రావడంతో మత్స్య సంపద పెరిగిందని జిల్లాలోని రంగనాయక సాగర్, అంతగిరి రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, ఇరిగేషన్ ఈఈ గోపాల కృష్ణ, మత్స్యశాఖ జిల్లా అధికారి రాములు, నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మత్స్యకార పురోభివృద్ధి, రిజర్వాయర్లలో చేపలు పట్టే అంశం, 58, 59 జీవోలు, సుడా ప్రగతి, ఇతరత్రా జిల్లా అభివృద్ధి, పురోగతిపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 28 వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని మత్స్యకార శాఖ అధికారిని ఆదేశించారు. దేశంలోనే ప్రధానంగా రంగనాయక సాగర్ లో చేపలను ప్రయివేట్ ఏజెన్సీలకు విక్రయించి వచ్చిన సొమ్మును మత్స్యకార సొసైటీలకు పంపిణీ చేయాలని సమీక్షలో నిర్ణయించారు.
రంగనాయక సాగర్ లో మూడేళ్లుగా చేపలు వదలడం చేస్తున్నాం. కానీ పట్టడం లేదని, లక్షలాది రకాల విలువైన చేపలు ఉన్నాయని వివరిస్తూ.. వీలైనంత తొందరగా మత్స్యకార సొసైటీ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మత్స్యశాఖ అధికారిని మంత్రి మందలించారు.
58, 59 జీవోలకు సంబంధించి లబ్ధిదారులతో త్వరగా పేమెంట్స్ కట్టించి వారికి క్రమబద్ధీకరణ చేసిన పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టాలు వస్తే లబ్ధిదారులకు చాలా లబ్ధి చేకూరుతుందని, శాశ్వత హక్కులు వస్తాయని, దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగి విక్రయించే వీలు ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు.
సుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ -లే అవుట్స్ సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో మిట్టపల్లి, పొన్నాలలో భూమి గుర్తించారు. ప్లాటింగ్ చేసి మార్చి నెలాఖరులోగా యాక్షన్ లోకి వెళ్లాలని, ఇదే సుడా తరహాలో గజ్వేల్ గడలో చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. అలాగే జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో సైతం పరిశీలనలు జరిపి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
గౌరవెల్లి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలి
ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తండా ప్రాంత వాసులైన గిరిజన నిర్వాసితులకు అందాల్సిన 21 కోట్ల రూపాయల నష్ట పరిహారం విషయమై ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా వీలైనంత త్వరగా అందించేలా ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు సూచించారు.
అనంతరం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి కళా ఆడిటోరియంలో తెలంగాణ సారస్వత పరిషత్తు సిద్ధిపేట జిల్లా ఉత్తవం సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ, సిద్ధిపేట వైభవం కవి సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై పుస్తక ఆవిష్కరించారు.
మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, కన్వీనర్ కొండి మల్లారెడ్డి, డాక్టర్ తైదల అంజయ్య, ఇతర కోర్ కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.