బీఆరెస్‌కు భూముల కేసులో పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వండి

భారత రాష్ట్ర సమితికి చెందిన ఎక్స్‌లెన్స్‌ సెంటర్ ఏర్పాటు కోసం స్థల కేటాయింపు వివాదంలో దాఖలైన పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది

  • Publish Date - January 25, 2024 / 04:52 PM IST
  • రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
  • కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలంటూ
  • కోర్టును ఆశ్రయించిన న్యాయవాది


విధాత: భారత రాష్ట్ర సమితికి చెందిన ఎక్స్‌లెన్స్‌ సెంటర్ ఏర్పాటు కోసం స్థల కేటాయింపు వివాదంలో దాఖలైన పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వాలని హైకోర్టు గురువారం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వివాదంలో అప్పటి సీఎం కేసీఆర్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, అప్పటి ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై కేసులు నమోదు చేయాలని చిక్కుడు ప్రభాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.


బీఆరెస్ ఎక్సలెన్స్‌ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల స్థలం కేటాయించింది. దాదాపు 1100 కోట్ల రూపాయల విలువైన భూమిని 37.53 కోట్లకే కట్టబెట్టారని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ స్థలంలో బీఆరెస్ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే.