ఆ..హీరో నా పెళ్లికి రాలేదు.. చాలా బాధ పడ్డా: రంభ హాట్ కామెంట్స్
విధాత: ‘బొబ్బిలి రాజా’తో పరిచయమై పలు చిత్రాల్లో నటించిన దివ్యభారతి హఠాత్తుగా ప్రమాదవశాత్తు మరణించింది. దాంతో ఆమె నటించిన పలు చిత్రాలు ఆగిపోయాయి. ఇదే సమయంలో ‘తొలిముద్దు’ అనే చిత్రంలో దివ్యభారతి సగం నటించింది. ఇందులో తమిళ హీరో, దర్శకుడైన త్యాగరాజన్ కుమారుడు ప్రశాంత్ హీరోగా నటించాడు. దాంతో దివ్యభారతి పోలికల్లోనే ఉన్న రంభ అనే హీరోయిన్‌ని తీసుకొని వచ్చి దివ్యభారతి బదులుగా డూప్‌గా నటింపజేసి చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారు. ఇక ఒకప్పుడు రంభ […]

విధాత: ‘బొబ్బిలి రాజా’తో పరిచయమై పలు చిత్రాల్లో నటించిన దివ్యభారతి హఠాత్తుగా ప్రమాదవశాత్తు మరణించింది. దాంతో ఆమె నటించిన పలు చిత్రాలు ఆగిపోయాయి. ఇదే సమయంలో ‘తొలిముద్దు’ అనే చిత్రంలో దివ్యభారతి సగం నటించింది. ఇందులో తమిళ హీరో, దర్శకుడైన త్యాగరాజన్ కుమారుడు ప్రశాంత్ హీరోగా నటించాడు.
దాంతో దివ్యభారతి పోలికల్లోనే ఉన్న రంభ అనే హీరోయిన్‌ని తీసుకొని వచ్చి దివ్యభారతి బదులుగా డూప్‌గా నటింపజేసి చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారు. ఇక ఒకప్పుడు రంభ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. చిన్న చిన్న హీరోలైన జెడి చక్రవర్తి వంటి వారి నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరితోనూ వరుస పెట్టి సినిమాలు చేసింది.
గ్లామర్ పరంగానే కాకుండా అల్లరి పిల్లగా అటు మోడ్రన్ దుస్తులలోనూ… ఇటు సంప్రదాయ దుస్తులలోనూ ఈమె ఇమిడిపోయేది. నటనా ప్రతిభ కూడా తోడవడంతో ఈమే చాలాకాలం టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. 1990 నాళ్లలో సౌత్ ఇండియాలో రంభ అత్యంత బిజీ హీరోయిన్ అని చెప్పవచ్చు. ఎన్నో రొమాంటిక్ చిత్రాల్లో నటించింది.
ఇక శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళిల కాంబోలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీసిన పెళ్లిసందడి చిత్రం అదిరి పోయే హిట్‌గా సంచలనం సృష్టించింది. దాంతో పెళ్లిసందడి తర్వాత శ్రీకాంత్ సమకాలీకుడు ఆయనతో కలిసి పలు చిత్రాలలో నటించిన జెడి చక్రవర్తి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే వచ్చిన బొంబాయి ప్రియుడు భారీ అంచనాలతో విడుదలైంది.
ఈ మూవీలో జెడి చక్రవర్తికి జోడీగా రంభ నటించింది. ఈ చిత్రం పెళ్లిసందడి రేంజ్‌లో మాత్రం ఆడలేదు. కానీ ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ.. జెడి చక్రవర్తిపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. జేడీ నా పెళ్ళికి రాలేదు.. చాలా బాధపడ్డాను.
నిజానికి అతనికి ఫ్రెండ్షిప్ చేయడం రాదు.. స్నేహం విషయంలో ఆయన ఒక అబద్దాల కోరు.. అంటూ సరదాగా మాట్లాడింది. దాంతో ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తను ఓ వెలుగు వెలిగిన సమయంలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఈమె నటించింది.
2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్ర కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు టీవీల్లో వచ్చే కార్యక్రమాలలో జడ్జిగా మాత్రం కనిపించి అలరిస్తోంది. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా రంభ యాక్టివ్‌గా కనిపిస్తోంది.