నాలాంటి హోంగార్డులు అవసరం లేదు.. ఆయనే పార్టీని గెలిపిస్తడు: ఎంపీ కోమటిరెడ్డి
విధాత: మునుగోడులో నాలాంటి హోంగార్డులు అవసరం లేదని, ఎస్పీ స్థాయి వాళ్లే ప్రచారానికి వెళ్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 100 కేసులు పెట్టినా సరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నాయకుడు చెప్పాడని, ఆయనే మునుగోడు ఉపఎన్నికలో పార్టీని గెలిపిస్తాడని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరికి నన్ను విమర్శించే స్థాయి లేదని, రాజయ్యను అడిగితే కడియం చరిత్ర చెబుతాడని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికలను భ్రష్టుపట్టించారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. […]

విధాత: మునుగోడులో నాలాంటి హోంగార్డులు అవసరం లేదని, ఎస్పీ స్థాయి వాళ్లే ప్రచారానికి వెళ్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 100 కేసులు పెట్టినా సరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నాయకుడు చెప్పాడని, ఆయనే మునుగోడు ఉపఎన్నికలో పార్టీని గెలిపిస్తాడని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరికి నన్ను విమర్శించే స్థాయి లేదని, రాజయ్యను అడిగితే కడియం చరిత్ర చెబుతాడని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికలను భ్రష్టుపట్టించారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్, దేశాన్ని బీజేపీ కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. మునుగోడులో అధికారాన్ని టీఆర్ఎస్, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయి. కోట్ల రూపాయలతో ఓట్లను కొనేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం టీఆర్ఎస్, బీజేపీ ఆగడాలను అడ్డుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ధన, అధికార బలంతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్, బీజేపీ తీరుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. అభివృద్ధి కోరుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.