Rains | భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. న‌లుగురి మృతి

Rains భారీగా విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు మ‌ట్టిలో కూరుకుపోయిన వాహ‌నాలు రాళ్లు రప్ప‌తో నిండిన గంగోత్రి హైవే రాష్ట్రానికి మూడు రోజులు భారీ వాన‌లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ విధాత‌: ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌కు న‌లుగురు మృతిచెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వాన‌ల‌కు పెద్ద‌ఎత్తున కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. మ‌ట్టిదిబ్బ‌ల కింద వంద‌ల వాహ‌నాలు కూరుకుపోయాయి. ఉత్త‌ర‌కాశీకి వెళ్లే గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై పెద్ద ఎత్తున కొండ‌చ‌రియ‌లు కూలిపోయాయి. వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. హైవే […]

  • Publish Date - July 11, 2023 / 05:39 AM IST

Rains

  • భారీగా విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు
  • మ‌ట్టిలో కూరుకుపోయిన వాహ‌నాలు
  • రాళ్లు రప్ప‌తో నిండిన గంగోత్రి హైవే
  • రాష్ట్రానికి మూడు రోజులు భారీ వాన‌లు
  • భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

విధాత‌: ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌కు న‌లుగురు మృతిచెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వాన‌ల‌కు పెద్ద‌ఎత్తున కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. మ‌ట్టిదిబ్బ‌ల కింద వంద‌ల వాహ‌నాలు కూరుకుపోయాయి. ఉత్త‌ర‌కాశీకి వెళ్లే గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై పెద్ద ఎత్తున కొండ‌చ‌రియ‌లు కూలిపోయాయి.

వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. హైవే మొత్తం పెద్ద బండ‌రాళ్ల‌తో నిండిపోయింది. మ‌ట్టిదిబ్బ‌ల కింద చిక్కుకున్న వాహ‌నాల వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇప్ప‌టికే వ‌ర‌ద‌లు ఉత్త‌రాఖండ్‌ను వ‌ణికిస్తుండగా, మ‌రోవైపు రాష్ట్రంలో మ‌రో మూడురోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ సోమ‌వారం హెచ్చ‌రిక‌లు జారీచేసింది. తాజా హెచ్చ‌రిక‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

చార్‌ధాయ్ య‌త్రికులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో చార్‌ధాయ్ య‌త్రికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఉత్తరాఖండ్ ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌సింగ్ ధామి సూచించారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్నందున అధికార యంత్రాంగం సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు. రాష్ట్రంలోని అన్ని న‌దులు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తున్నాయ‌ని తెలిపారు. న‌దీప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అన్ని ర‌కాల స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు.