కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి

విధాత: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పూర్తిగా కాలిపోయాయి. భక్తులను ఫటా నుంచి కేదార్‌నాథ్‌ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కుప్ప కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో జ్యోతిర్లింగ […]

  • By: krs    latest    Oct 18, 2022 7:28 AM IST
కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి

విధాత: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పూర్తిగా కాలిపోయాయి. భక్తులను ఫటా నుంచి కేదార్‌నాథ్‌ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కుప్ప కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా వేసవి కాలం నుంచి ఆలయం దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. దీపావళి వరకు ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయి. అయితే ట్రెక్కింగ్ చేయలేని భక్తుల కోసం.. హెలికాప్టర్‌ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి.