విధాత: టాలీవుడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎట్టకేలకు శర్వానంద్ ఎవర్ని పెళ్లాడబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది.
హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 26న శర్వానంద్, రక్షితా రెడ్డి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఇక పెళ్లి తేదీ కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. రక్షితా రెడ్డి టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి మేనకోడలు.