High Court | నిర్మాణం చేపట్టినా తుది తీర్పు మేరకే చర్యలు
High Court | హైదరాబాద్, విధాత : ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రతివాద సంస్థ నిర్మాణం చేపట్టినా తుది ఉత్తర్వుల మేరకే చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం షేక్‌పేటలోని సర్వే నంబర్ 403లో 4 ఎకరాల 18 గుంటల భూమిని ఇచ్చిందని, ఎలాంటి వేలం లేకుండా భూమిని ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రొటక‌్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఇండియా ట్రస్టు అయిన […]

High Court |
హైదరాబాద్, విధాత : ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రతివాద సంస్థ నిర్మాణం చేపట్టినా తుది ఉత్తర్వుల మేరకే చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం షేక్‌పేటలోని సర్వే నంబర్ 403లో 4 ఎకరాల 18 గుంటల భూమిని ఇచ్చిందని, ఎలాంటి వేలం లేకుండా భూమిని ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రొటక‌్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ ఇండియా ట్రస్టు అయిన రాష్ట్రీయ వానరసేన హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది.
జూబ్లిహిల్స్‌లోని ఈ భూమి విలువ దాదాపు రూ.260 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 40 ఏళ్లకు పైగా ఆ స్థలంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దేవుడిపై ఎలాంటి గౌరవం లేకుండా కూల్చివేసిందన్నారు. గుడిని మళ్లీ నిర్మించేలా సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించేందుకు తమకు 4 వారాలు సమయం కావాలని రెడ్ ఫోర్ట్ సంస్థ న్యాయవాది కోరగా, ధర్మాసనం నిరాకరించింది. 2 వారాలు సమయం ఇస్తూ, పిటిషన్‌ను ఆగస్టు 9కి వాయిదా వేసింది.