High Court
హైదరాబాద్, విధాత: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ లో తప్పడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన ఓటర్ రాఘవేంద్ర రాజు 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగేందుకు అర్హుడు కాదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ సరైందికాదని, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
అనంతరం ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, పిటిషనర్ వేసిన పిటిషన్‌ను అనుమతించింది.