Modi Degree: ఉన్న‌వాళ్ల‌కు ఉద్యోగాలు రావు.. లేని వాళ్ల‌కు అత్యున్న‌త ఉద్యోగం.. మోడీనుద్దేశించి MLC క‌విత ట్వీట్‌

విధాత‌: దేశంలో నిరుద్యోగిత రేటు 7.8 శాతం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి అని ఆమె అభివర్ణించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ కల్పన ఏమైందని ప్రధానిని ప్రశ్నించారు. మోసపూరిత హామీతో యువతను దగా చేశారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ట్విటర్‌లో ప్రశ్నించారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం ఉన్నదా? లేదా? అని నిలదీశారు. నిజమైన డిగ్రీ […]

Modi Degree: ఉన్న‌వాళ్ల‌కు ఉద్యోగాలు రావు.. లేని వాళ్ల‌కు అత్యున్న‌త ఉద్యోగం.. మోడీనుద్దేశించి MLC క‌విత ట్వీట్‌

విధాత‌: దేశంలో నిరుద్యోగిత రేటు 7.8 శాతం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి అని ఆమె అభివర్ణించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ కల్పన ఏమైందని ప్రధానిని ప్రశ్నించారు. మోసపూరిత హామీతో యువతను దగా చేశారని విమర్శించారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ట్విటర్‌లో ప్రశ్నించారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం ఉన్నదా? లేదా? అని నిలదీశారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని, కానీ డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలో అత్యున్నత ఉద్యోగం ఉందని మోడీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా ట్వీట్‌ చేశారు.