హానర్‌ నుంచి మేజిక్‌ 6 సిరీస్‌ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్స్‌..! లాంచ్ డేట్‌ ఎప్పుడంటే..?

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ హానర్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కు లాంచ్‌కు రంగం సిద్ధం చేసింది

హానర్‌ నుంచి మేజిక్‌ 6 సిరీస్‌ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్స్‌..! లాంచ్ డేట్‌ ఎప్పుడంటే..?

HONOR Magic 6 | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ హానర్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కు లాంచ్‌కు రంగం సిద్ధం చేసింది. హానర్‌ మేజిక్‌ 6 సిరీస్‌ మొబైల్‌ను తీసుకువస్తున్నది. ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు విడుదల చేయనున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. లాంచ్‌ డేట్‌తో పాటు ఫీచర్స్‌, ధర వివరాలు తెలుసుకుందాం రండి..!


మేజిక్‌ 6 సిరీస్‌ జనవరి 11న లాంచ్‌


ఆన్‌లైన్‌ లీక్‌ అయిన సమాచారం మేరకు హానర్‌ మేజిక్‌ 6 సిరీస్‌ చైనాలో వచ్చే ఏడాది జనవరి 11న లాంచ్‌ కానున్నది. కంపెనీ గ్రాండ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులోనే మేజిక్‌ 6 సిరీస్‌ను లాంచ్‌ చేయనున్నది. నివేదిక ప్రకారం.. హానర్‌ మేజిక్‌ 6 సిరీస్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్​ 3 ప్రాసెసర్​, క్వాడ్​- కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ ప్యానెల్​తో రానున్నది. డ్యూయెల్​ ఫ్రెంట్​ ఫేసింగ్​ కెమెరాల కోసం పిల్​ షేప్​ కటౌట్​ డిజైన్​ రానున్నట్లు తెలుస్తున్నది.


ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో 50ఎంపీ ఓమ్నీ విజన్​ ఓవీ50కే ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. టాప్​ ఎండ్​ మోడల్​ హానర్​ మేజిక్​ 6 ప్రోలో 2వే శాటిలైట్​ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని టాక్‌. మేజిక్ ​ఓఎస్​ 8.0 సపోర్ట్​ చేసే ఆన్​ డివైజ్​ జెనరేటివ్​ ఏఐ కెపబులిటీ ఫీచర్స్‌ పరిచయం చేయనున్నట్లు తెలుస్తున్నది.


మరో స్పెషల్‌ ఎడిషన్‌ సైతం..


మేజిక్​ 6 సిరీస్​తో పాటు స్పెషల్​ ఎడిషన్​ని సైతం హానర్‌ లాంచ్‌ చేయాలని భావిస్తున్నది. ఈ డివైజ్‌ పేరు హానర్​ మేజిక్​ 6 పోర్షే ఎడిషన్​. ఐకానిక్​ పోర్షే 911 స్పోర్ట్స్​ కార్​లోని డిజైన్​ ఎలిమెంట్స్​ కొత్త గాడ్జెట్‌లో ఉంటాయని తెలుస్తున్నది. స్పెసిఫికేషన్స్​ మాత్రం మేజిక్​ 6 ప్రోని పోలి ఉంటాయని, ఇంకా 160 ఎంపీ పెరిస్కోపిక్​ టెలిఫొటోలెన్స్​ ఉంటుందని తెలుస్తున్నది. అయితే, మేజిక్‌ సిరీస్‌ ఫోన్లకు ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే, ఫోన్ల ధరలపై స్పష్టత లేదు. లాంచ్‌ ఈవెంట్‌ నాటికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.