Horoscope | 02.04.2025, బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది

  • By: sr    latest    Apr 02, 2025 9:19 AM IST
Horoscope | 02.04.2025, బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి (02.04.2025), బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన భయాందోళనలు ఉండ‌వు. ప్రయాణాల్లో జాగ్రత్త అవ‌స‌రం. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం. సానుకూలంగా కుటుంబ పరిస్థితులు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యం. వృత్తి జీవితం బిజీ

వృష‌భం

నిలకడగా ఆర్థిక పరిస్థితి. స్థిరాస్తుల విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం. అదనపు ఆదాయ ప్రయత్నాలు స‌ఫ‌లం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. పరిశుభ్రత పాటిస్తే అనారోగ్య బాధలు ఉండవు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం. ఆశాజనకంగా వ్యాపారాలు.

మిథునం

ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం. ఆకస్మిక ధననష్టం సూచ‌న‌లు. కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు. ఉన్నతస్థాయి వ్యక్తులతో ప‌రిచ‌యాలు. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలనం సూచనలు. సన్నిహితులతో స్నేహంగా మెలగాలి. నిరుద్యోగులకు మంచి అవ‌కాశాలు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

క‌ర్కాట‌కం

మిత్రుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కీర్తి, ప్రతిష్ఠలు రెట్టింపు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేస్తారు. రుణబాధలు, శత్రుబాధలు ఉండవు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు రెట్టింపు.

సింహం

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక ప్రయత్నాల‌న్నీ సఫలం. బంధు, మిత్రులను కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభం. రుణబాధలు పోతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలుగుపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత.

క‌న్య‌

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు, వృధా ప్రయాణాలు ఎక్కువ. కుటుంబంలో సుఖ సంతోషాలు. మానసిక ఆందోళనతోనే కాలం న‌డుస్తుంది. బంధు మిత్రులతో వైరంఅవ‌కాశం. శారీరకంగా బలహీనులవుతారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. పెళ్లి సంబంధం కుదురుతుంది. అదనపు ఆదాయానికి అవకాశాలు.

తుల

ఆదాయ ప్రయత్నాల్లో పురోగతి. తోటి వారితో విరోధం క‌లుగ‌కుండా జాగ్రత్త వ‌హించాలి. వ్యాపారంలో ధననష్టం అవకాశాలు. ముఖ్య వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు. అధిక వృధా ప్రయాణాలు. కుటుంబం విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి. సాఫీగా కుటుంబ జీవితం. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు

వృశ్చికం

అదనపు ఆదాయ మార్గాలు అనుకూలం. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి. అధిక‌ రుణ ప్రయత్నాలు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. నిలకడగా వ్యాపారాలు. ఆర్థిక లావాదేవీల్లో లాభాలు. వ్యక్తిగత సమస్యలు ప‌రిష్కారం.

ధ‌నుస్సు

ఆర్థిక ప్రయత్నాలు సఫ‌ళం. బంధు మిత్రులతో విరోధం అవ‌కాశం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యబాధలు ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు అవ‌స‌రం. వృత్తి ఉద్యోగ రంగాల్లో వృద్ధి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి కావు. మిత్రుల వ‌ళ్ల‌ తప్పుదోవ ప‌డుతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్య‌త‌ పెరుగుతుంది.

మ‌క‌రం

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి. ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికం. ఆకస్మిక ధననష్టం. అనారోగ్య స‌మ‌స్య‌తో అధిక వ్య‌యం. తీర్థయాత్రలు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు అధిగమిస్తారు. మెరుగ్గా కుటుంబ పరిస్థితులు. అనుకూలంగా వృత్తి, ఉద్యోగాలు.

కుంభం

తలపెట్టిన ప్రయత్నం విజయవంతం. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందం పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు. ఆకస్మిక ధననష్టం అవకాశం. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రులతో కలహాలకు అవ‌కాశం. పెండింగ్‌ పనులు, వ్యవహారాలు పూర్తి. కొద్దిపాటి వ్యయప్రయాసలు. అదనపు ఆదాయ ప్రయత్నాలు స‌ఫ‌ళం. పని ఒత్తిడి నుంచి ఉపశమనం

మీనం

సాఫీగా కుటుంబ పరిస్థితులు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం అవ‌కాశం. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. తలచిన కార్యాలకు ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా పోతాయి. కొత్త‌ వ్యక్తులకు దూరంగా ఉండాలి. లాభసాటిగా వ్యాపారాలు. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి.