శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారు చెడుకు దూరంగా ఉంటే మంచిది..
మేషం : శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింత ఉండదు. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. వృషభం : ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు పొందుతారు. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మిథునం : ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం […]

మేషం : శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింత ఉండదు. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.
వృషభం : ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు పొందుతారు. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
మిథునం : ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
కర్కాటకం : ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి.
సింహం : ఈ రాశివారికి సోదర వైరం కలిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోతారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
కన్య : ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. మానసికానందాన్ని పొందుతారు. వృత్తిరీత్యా సమస్యలను ఎదుర్కొటారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు.
తుల : వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృశ్చికం : ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణ బాధలు తొలగిపోయి, ఇతరులకు ఉపకారం చేసేందుకు వెనుకాడరు. శత్రు బాధలుండవు.
ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. చెడుకు దూరంగా ఉండటం మంచిది.
మకరం : అనారోగ్య బాధలు ఉండవు. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. మర్యాద, మన్ననలను పొందుతారు.
కుంభం : ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి.
మీనం : ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది.