17.02.2023 శుక్రవారం, రాశి ఫలాలు.. ఈ రాశివారికి ధన్యవ్యయం.. ఆరోగ్య సమస్యలు
మేషం : ఉద్యోగరీత్యా ప్రయాణములు చేయుదురు. అధికారులు మిమ్మలను అపార్థం చేసుకొను అవకాశములు కనిపిస్తున్నవి. చిన్న పనులైనను ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కొన్ని వస్తు నష్టములు కలుగవచ్చును. వృషభం : శరీరంలో అజీర్ణ సంబంధమైన బాధలు కలుగవచ్చును. అనుకొని చిక్కులు మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. ధన వ్యయము పెరుగుతుంది. ఇతరుల సహాయమును కోరవలసి వస్తుంది. మిథునం : కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభము గోచరిస్తుంది. పట్టుదలను ప్రదర్శిస్తారు. గౌరవం […]

మేషం : ఉద్యోగరీత్యా ప్రయాణములు చేయుదురు. అధికారులు మిమ్మలను అపార్థం చేసుకొను అవకాశములు కనిపిస్తున్నవి. చిన్న పనులైనను ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కొన్ని వస్తు నష్టములు కలుగవచ్చును.
వృషభం : శరీరంలో అజీర్ణ సంబంధమైన బాధలు కలుగవచ్చును. అనుకొని చిక్కులు మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. ధన వ్యయము పెరుగుతుంది. ఇతరుల సహాయమును కోరవలసి వస్తుంది.
మిథునం : కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభము గోచరిస్తుంది. పట్టుదలను ప్రదర్శిస్తారు. గౌరవం పెరుగుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు.
కర్కాటకం : మీ నైపుణ్యతకు గుర్తింపు లభింస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాన ధర్మాది కార్యములు సంతోషాన్నిస్తాయి. దైవ కార్యలలో పాల్గొంటారు. బకాయి పడ్డ డబ్బులు చేతి కందుతాయి.
సింహం : వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం చికాకు కలిగిస్తుంది. వృథా సంచారము. వలన సమయం వృథా అవుతుంది. సోమరితనము వలన ఇబ్బంది పడతారు. వృథా ధన వ్యయము కలుగవచ్చును.
కన్య : ప్రభుత్వాధికారులకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శత్రువులతో వివాదాలు పరిష్కారమౌతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనలాభము కలుగుతుంది.
తుల : సోదర వర్గ సహకారం లభిస్తుంది. వాక్పటిమ, అత్మస్థైర్యముతో పనులు పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం : శరీర బాధలు కలుగవచ్చును. ప్రయణముల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్యములన వినవలసి వస్తుంది. ధనవ్యయము కలుగవచ్చును.
ధనుస్సు : కుటుంబసభ్యులకు అండగా నిలబడతారు. పరోపకారము సంతోషాన్నిస్తుంది. పెద్దలతో గౌరవంగా నడుచుకుంటారు. ధనలాభము కలుగుతుంది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
మకరం : స్థిరాస్థి వ్యవహారాలు అశాంతి కలిగిస్తాయి. విదేశ ప్రయాణయత్నాలకు ఆటంకం కలుగవచ్చును. అనుకొని ప్రమాదముల మూలకంగా అశాంతి కలుగుతుంది. తగిన గౌరవము రాక పోవడం వలన మన సౌఖ్యము ఉండకపోవచ్చును.
కుంభం : విద్యావంతులు, మేధావులకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభకార్యములను ఆచరిస్తారు. సంతాన మూలకంగా ఆనందాన్ని పొందుతారు. రోజంతా మనోల్లాసంగా గడుస్తుంది.
మీనం : మోసపోయే ప్రమాదం నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. మనోభీష్టములు నెరవేరుతాయి.