మంగ‌ళ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ర‌హ‌స్య శ‌త్రు బాధ‌లు..!

మేషం : ఈ రాశివారు ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. వృష‌భం : ఈ రాశి వారికి రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశం ఉంది. మిథునం : ఈ రాశివారికి ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మించుట‌కు రుణ ప్ర‌య‌త్నం చేస్తారు. […]

మంగ‌ళ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ర‌హ‌స్య శ‌త్రు బాధ‌లు..!

మేషం : ఈ రాశివారు ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

వృష‌భం : ఈ రాశి వారికి రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశం ఉంది.

మిథునం : ఈ రాశివారికి ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మించుట‌కు రుణ ప్ర‌య‌త్నం చేస్తారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి.

క‌ర్కాట‌కం : ఈ రాశివారు బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే ప‌నుల్లో ఇబ్బందులుండును. కొత్త ప‌నులు ప్రారంభించుట మంచిది కాదు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

సింహం : ఈ రాశి వారికి స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.

క‌న్య : ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగముంటుంది. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

తుల : ఈ రాశివారికి ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మవుతాయి. బంధు, మిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ర‌హ‌స్య శత్రు బాధ‌లుండే అవ‌కాశం ఉంది.

వృశ్చికం : ఈ రాశివారు ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు.

ధ‌నుస్సు : ఈ రాశివారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందుతారు. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

మ‌క‌రం : ఈ రాశివారికి చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది, ప్ర‌యాణాలు ఉంటాయి.

కుంభం : ఈ రాశివారికి అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ‌తో పాటు మానసికాందోళ‌న త‌ప్ప‌దు.

మీనం : ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పొందుతారు. శాశ్వ‌త ప‌నుల‌కు శ్రీకారం చుడుతారు. ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు.