12-03-2023 ఆదివారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి శ‌త్రువులు మిత్రులవుతారు

మేష రాశి : వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది.. వృషభ రాశి : పండితులు, విద్యావంతులతో సంభాషలతో విద్యార్థులు ఉల్లాసాన్ని పొందతారు. శుభకార్యాచరణము సంతోషాన్నిస్తుంది. ప్రయాణాలు ఆహ్లాదాన్నిస్తాయి. ధన లాభము సంతోషాన్ని కలిగిస్తుంది. మిథున రాశి : ఊహించని పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తాయి. శ‌త్రు భాధలు తొలగిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కర్కాటక రాశి : వృత్తి, ఉద్యోగాలలో […]

12-03-2023 ఆదివారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి శ‌త్రువులు మిత్రులవుతారు

మేష రాశి : వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది..

వృషభ రాశి : పండితులు, విద్యావంతులతో సంభాషలతో విద్యార్థులు ఉల్లాసాన్ని పొందతారు. శుభకార్యాచరణము సంతోషాన్నిస్తుంది. ప్రయాణాలు ఆహ్లాదాన్నిస్తాయి. ధన లాభము సంతోషాన్ని కలిగిస్తుంది.

మిథున రాశి : ఊహించని పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తాయి. శ‌త్రు భాధలు తొలగిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

కర్కాటక రాశి : వృత్తి, ఉద్యోగాలలో చికాకులు కలుగుతాయి. సమాజంలో గౌరవం తగ్గడం వలన మనోవ్యధ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు పడతారు. తొందరపాటు పనికిరాదు.

సింహ రాశి : భయం మూలకంగా పనులను వాయిదావేస్తారు. పితృవర్గము వారితో విబేధాలు కలుగవచ్చును. పుణ్యక్షేత్ర సందర్శనం ఆనందాన్నిస్తుంది. నూతన గృహప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.

కన్యా రాశి : శ్రమ ఎక్కువగా వుంటుంది. ఔషధ సేవనము చేయవలసి రావచ్చును. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పరోపకరమునందు ఆసక్తి చూపుతారు. ద్ర‌వ్య‌లాభములుంటాయి.

12-03-2023 నుండి 18-03-2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

తులా రాశి : నూతన కార్యారంభము సంతోషాన్నిస్తుంది. మంచి వ్యక్తులతో సంభాషణ‌లు జరుపుతారు. సన్మాన గౌరవములు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభకార్యమూలక వ్యయము కలుగుతుంది.

వృశ్చిక రాశి : విరోధులను ధైర్యంగా ఎదిరిస్తారు. కుటుంబ సభ్యులపై అపవాదులు తొలగిపోతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఋణ మూలక అశాంతి కలుగవచ్చును.

ధనుస్సు రాశి : వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రముఖలతో కలిసి కార్యసిద్దిని పొందుతారు. భోజన సౌఖ్యము లభిస్తుంది. ధన వ్యయమును మితముగా వుండేలా జాగ్రత్త పడతారు.

మకర రాశి : వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్థి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది.

కుంభ రాశి : వృత్తి యందు ఇబ్బందులు ఎదురవుతాయి. నేత్ర బాధ, శిరోవాధలు కలుగవచ్చును. మానసిక అశాంతి కలుగుతుంది. సంతానములక అశాంతి కలుగవచ్చును. మంద బుద్ధి కలిగి వుంటారు.

మీన రాశి : శరీర బలహీనతలు బాధిస్తాయి. గృహమందు అసౌకర్యంగా అనిపిస్తుంది. భయం మూలకంగా పనులు వాయిదా వేస్తారు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా వుంటాయి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.