AP | ఢిల్లీకి లోకేష్.. విజయనగరానికి జగన్.!
AP రాష్ట్రంలో హాట్ హాట్ పాలిటిక్స్ !! విధాత: ఆంధ్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఒకెత్తు.. చంద్రబాబు అరెస్ట్ ఇంకో ఎత్తు అన్నట్లుగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి ప్రజల్లోకి వెళ్లి మద్దతు కోరేందుకు ప్రయత్నిస్తుండగా బాబు అరెస్ట్ ను సమర్థించుకునెందుకు ఇటు టిడిపి కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఇంకా పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఏపి ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పు.. ఇలా బోలెడు ఉన్నాయని […]

AP
- రాష్ట్రంలో హాట్ హాట్ పాలిటిక్స్ !!
విధాత: ఆంధ్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఒకెత్తు.. చంద్రబాబు అరెస్ట్ ఇంకో ఎత్తు అన్నట్లుగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి ప్రజల్లోకి వెళ్లి మద్దతు కోరేందుకు ప్రయత్నిస్తుండగా బాబు అరెస్ట్ ను సమర్థించుకునెందుకు ఇటు టిడిపి కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఇంకా పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఏపి ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పు.. ఇలా బోలెడు ఉన్నాయని వైసిపి అంటోంది.
ఈ మేరకు వైసిపి అనుకూల మీడియా ప్రయత్నిస్తోంది. అటు టిడిపి సైతం ఇదే స్థాయిలో ఎదురు దాడి చేస్తోంది. కక్షతో అరెస్ట్ చేశారని, ఆయన్ను ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యమని, తాము ఈ తప్పుడు కేసులను ఎదుర్కొంటామని టిడిపి చెబుతూ తమ మీడియాలో గట్టిగానే వాదిస్తోంది. దీనికితోడు ఇప్పుడు టిడిపికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. తామిద్దరం కలిసే వెళ్తామని..ఎన్నికల్లో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు.
నిన్న చంద్రబాబును జైల్లో కలిసి వచ్చిన పవన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక చంద్రబాబు అరెస్టును బండి సంజయ్.. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇక బాబు అరెస్ట్ అక్రమం.. కక్ష పూరితం అని దేశానికి చెప్పేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ మీడియా సమావేశం పెట్టీ ఆయన్ను జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని చెబుతారని అంటున్నారు.
ఇక జగన్ కాసేపట్లో విజయనగానికి వెళ్తున్నారు. అక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించడం తోబాటు మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు అక్కడి నుంచే ప్రారంభం చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. ఆయన ఈ సభలో ఈ రాజకీయ అంశాలు.. పవన్.చంద్రబాబు.. పొత్తులు.. బాబు అరెస్ట్ అంశాలన్నీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు అని అంటున్నారు.