Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌కార్డ్ హోల్డర్లకు భారీగా డిస్కౌంట్..!

Amazon Great Indian Festival | పండగల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి పండుగలకు సైతం సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించి పనిలో పడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు రెడీ అయ్యింది. త్వరలోనే ఫెస్టివల్ సీజన్ సేల్స్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నదో మాత్రం ప్రకటించలేదు.
అయితే, సమాచారం మేరకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వినియోగదారులకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, అలెక్సా తదితర డివైజెస్‌పై భారీ డిస్కౌంట్‌లను ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. తొలిసారిగా అమెజాన్ నుంచి కొనుగోలు చేయబోతున్న వారికి వెల్‌కమ్ రివార్డు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
అలాగే ఐక్యూ జెడ్7 ప్రో, హానర్ 90 ప్రో మొబైల్స్‌తో పాటు సామ్‌సంగ్ ఎం34, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3, రియల్‌మీ 60 5జీ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ పాత మోడల్స్‌పై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీగా డిస్కౌంట్స్ సైతం ఇవ్వబోతున్నట్లు సమాచారం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ ఫెస్టివల్ సీజన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. మిడ్ రేంజ్‌లో రాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ, ఐక్యూ జెడ్7ఎస్, టెక్నో పోవా 5ప్రో తదితర స్మార్ట్ ఫోన్‌లపై భారీగానే డిస్కౌంట్ ఉండబోతున్నట్లు సమాచారం.
ఫెస్టివల్ సీజన్‌లో నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా పలు ఆఫర్లు ఇవ్వనున్నది. ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందు నుంచే ఆఫర్లు మొదలవనున్నాయి. ఈ సీజన్‌లో ల్యాప్‌టాప్‌లపై సైతం మంచి డిస్కౌంట్ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఏకంగా 75 శాతం డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నట్లు స్మార్ట్ టీవీలపై 75శాతం వరకు, అలెక్సా, ఫైర్ టీవీలపై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నది. దీనిపై అమెజాన్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.