విధాత: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పలు సందర్భాల్లో చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాజ్యాంగం రాసిన మహానీయుడు అంబేద్కర్‌కు సముచిత గౌరవం కల్పిస్తున్నారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అనేక పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ పథకం ఫలాలు అందుతున్నాయి. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తున్న కేసీఆర్.. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేశారు. అంతే కాకుండా భారత పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది.
దీంతో పాటు హైదరాబాద్ నగరానికే తలమానికమైన హుస్సేన్ సాగర్ తీరాన.. ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 11 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహం రూపకల్పన బాధ్యతను కేపీసీ ప్రైవేటు లిమిటెడ్ నిర్మాణ సంస్థకు అప్పగించారు. ప్రధాన శిల్పిగా పద్మభూషణ్ రామ్ వన్‌జీ సుతార్ వ్యవహరించారు. ఈ భారీ అంబేద్కర్ విగ్రహాం డ్రోన్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మీరు ఆ మహానీయుడి విగ్రహం వైపు ఓసారి లుక్కేయండి.