హైదరాబాద్‌ ఫార్ములా-ఈ రేస్‌ విజయవంతం.. వరల్డ్‌ చాంపియన్‌గా జీన్‌ ఎరిన్‌

#HyderabadEPrix విధాత: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌ విజయవంతమైంది. దేశంలో తొలిసారిగా నిర్వహించిన రేస్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. ఈ రేసులో జీన్‌ ఎరిన్‌ గెలుపొందిన వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఎరిన్‌ ప్రపంచ చాంపియన్‌ షిప్‌ గెలువడం ఇది మూడోసారి. రెండు, మూడో స్థానాల్లో నిక్‌ క్యాసిడీ, సెబాస్టియన్‌ నిలువగా.. విజేతలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్రోఫీలను బహూకరించారు. సాగర […]

  • By: krs    latest    Feb 11, 2023 2:18 PM IST
హైదరాబాద్‌ ఫార్ములా-ఈ రేస్‌ విజయవంతం.. వరల్డ్‌ చాంపియన్‌గా జీన్‌ ఎరిన్‌

#HyderabadEPrix

విధాత: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌ విజయవంతమైంది. దేశంలో తొలిసారిగా నిర్వహించిన రేస్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. ఈ రేసులో జీన్‌ ఎరిన్‌ గెలుపొందిన వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు.

ఎరిన్‌ ప్రపంచ చాంపియన్‌ షిప్‌ గెలువడం ఇది మూడోసారి. రెండు, మూడో స్థానాల్లో నిక్‌ క్యాసిడీ, సెబాస్టియన్‌ నిలువగా.. విజేతలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్రోఫీలను బహూకరించారు.

సాగర తీరంలో 2.8 కిలోమీటర్ల పొడవైన సర్క్యూట్‌లో మొత్తం 11 జట్లు పాల్గొనగా.. 22 రేసర్లు తమ కార్లతో హోరెత్తించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్‌3 కార్లతో రేసర్లు అదరగొట్టారు. ఈ రేస్‌లో భారత్‌ నుంచి మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్‌ జాగ్వార్‌ బరిలోకి దిగడం విశేషం.

ఇక రేసును వీక్షించేందుకు సినీ, రాజకీయరంగ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. విదేశాలకే పరిమితమైన ఫార్ములా రేస్‌ హైదరాబాద్‌లో తొలిసారిగా జరుగడంతో తిలకించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్ హాజరయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ సైతం రేస్‌ను వీక్షించాడు. అలాగే సినీ నటులు నాగార్జున, రామ్‌ చరణ్‌, నాగచైతన్య, అఖిల్‌ దుల్కర్ సల్మాన్, శృతి హాసన్ హాజరయ్యారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర సైతం ఫార్ములా రేస్‌ను వీక్షించారు. మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు సైతం రేస్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. స్వదేశంలో జరిగిన రేస్‌లో జట్టు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు.