38 మందితో ఫోన్ ట్యాపింగ్‌ లాగర్ రూమ్‌

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావుతో పాటు 15మంది అధికారులు ఎస్‌ఐబీని కంట్రోల్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లుగా పోలీసులు గుర్తించారు.

  • By: Somu    latest    Mar 27, 2024 12:41 PM IST
38 మందితో ఫోన్ ట్యాపింగ్‌ లాగర్ రూమ్‌
  • ఎస్‌ఐబీని కంట్రోల్ చేసిన 15మంది అధికారులు

విధాత : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావుతో పాటు 15మంది అధికారులు ఎస్‌ఐబీని కంట్రోల్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లుగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు మాజీ డీఐజీ ఆధ్వర్యంలో ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్ నడిచిన ఎస్ఐబీ నడిచిందని తేల్చారు. ఇందులో అదనపు ఎస్పీల్లో ఇప్పటికే భుజంగారావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు.


రిటైర్డ్ అయిన తర్వాత నలుగురు డిఎస్పీలు అక్కడే పని చేస్తున్నరని, వారికి పలువురు ఇన్‌స్పెక్టర్లు సహకరించారని, ఎస్ఐబీలో మొత్తం 38 మంది సిబ్బందితో లాగర్ రూమ్ నడిపించినట్లుగా దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు నెంబర్లను వారు ట్రాప్ చేశారని, ఒఎస్డీల పేరుతో రిటైరైనా మాజీ పోలీసు అధికారులు ఎస్‌ఐబీలో చలామణి అయ్యారని దర్యాప్తు బృందం గుర్తించింది.