Hydrabad | పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి!

Hydrabad విధాత: బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కర అంశంగా మారింది. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ ఆహ్వానించారు. వారిద్దరి భేటీ అంశాన్ని రహస్యంగా ఉంచారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై పొంగిలేటికి ఉన్న సందేహాలపై, షరతులపై ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి […]

  • Publish Date - June 14, 2023 / 01:47 PM IST

Hydrabad

విధాత: బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కర అంశంగా మారింది. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.

పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ ఆహ్వానించారు. వారిద్దరి భేటీ అంశాన్ని రహస్యంగా ఉంచారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై పొంగిలేటికి ఉన్న సందేహాలపై, షరతులపై ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తుంది.

పొంగులేటి తోపాటు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న దానిపై ఇరువురు చర్చించారు. ఖమ్మంలో బిజెపి తలపెట్టిన అమిత్ షా పర్యటనకు ముందుగానే పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేరేలా రేవంత్ రెడ్డి చొరవ చూపడం గమనార్హం. రాహుల్ గాంధీ అమెరికా నుండి తిరిగి రాగానే పొంగులేటి, జూపల్లి ప్రభృతులు కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా సమాచారం.