Hyper Aadi విధాత: ఆడవాళ్లపై పంచులు, చిల్లర జోకులు, నాసిరకం కామెడితో బుల్లితెరలో టాలెంట్ చూపిస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా హైపర్ ఆది అనే అంటుంటారు సోషల్ మీడియాలో ఓ వర్గం. ఇతని టాలెంట్‌కి కాస్త విజ్ఞత కూడా ఉండి ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని కమెడియన్ అయ్యేవాడు. హాస్యం పండించడం, తనకిచ్చిన టైంలో టైమింగ్‌కి తగ్గట్టుగా పంచులు విసరడంలో హైపర్ ఆది దిట్ట. అలాంటి వాడు నెమ్మదిగా కాస్త దిగిపోయి […]
Hyper Aadi
విధాత: ఆడవాళ్లపై పంచులు, చిల్లర జోకులు, నాసిరకం కామెడితో బుల్లితెరలో టాలెంట్ చూపిస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా హైపర్ ఆది అనే అంటుంటారు సోషల్ మీడియాలో ఓ వర్గం.
ఇతని టాలెంట్‌కి కాస్త విజ్ఞత కూడా ఉండి ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని కమెడియన్ అయ్యేవాడు. హాస్యం పండించడం, తనకిచ్చిన టైంలో టైమింగ్‌కి తగ్గట్టుగా పంచులు విసరడంలో హైపర్ ఆది దిట్ట.
అలాంటి వాడు నెమ్మదిగా కాస్త దిగిపోయి కామెడీ చేయడం చాలా మందికి రుచించదు. ఇతనికి ఆడ శత్రువులూ ఎక్కువే. అందుకే ఆడవాళ్లంతా కలిసి ఆయనని కిడ్నాప్ చేసేశారు. ఓ బల్క్ గ్రూపు లేడీస్.. ఓ గదిలో హైపర్ ఆదిని బందించేసి అన్నం, నీళ్లు ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారు. ఈ కిడ్నాప్ హడావుడి కాసేపు అందరినీ కంగారు పెట్టింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. బుల్లితెర రీల్ లైఫ్‌లో.
విషయంలోకి వస్తే.. హైపర్ ఆది చేస్తున్న కామెడీ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఒక స్కిట్ ఇది. ఈ స్కిట్లో ఆడవారు.. అందులోనూ పాపులర్ సీరియల్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారు. ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వడం లేదని, వాళ్లమీద పంచులు పేలుస్తూ, నైటీలు బంద్ చేయాలనే విమర్శలు చేస్తున్నాడని ఈ శిక్ష వేశారు.
అయితే తనని కిడ్నాప్ చేశారు సరే కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఈ శిక్ష వేసినా హాయిగా స్వీకరిస్తానని హైపర్ ఆది అన్నాడు. ఎప్పటిలానే ఈ స్కిట్లో కూడా హైపర్ ఆది తన మార్క్ పంచ్‌లు ఓ రేంజ్లో పేల్చి షోకి రక్తికట్టించాడు.
అయితే ఈ షో కి సంబంధించిన ప్రోమో మాత్రం.. నిజంగానే హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారనేంత బిల్డప్‌తో క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. హైపర్ ఆది ఉన్నప్పుడు ఓ రేంజ్లో వెలిగిపోయిన జబర్దస్త్.. ఇప్పుడు మసకబారుతోంది.
కానీ ఆయన ఉన్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ మాత్రం మంచి రేటింగ్‌నే రాబట్టుకుంటోంది. ఇందులో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా.. టాలెంట్ ఉన్న వారిని కూడా వెతికి మరీ పట్టుకొచ్చి.. ప్రదర్శించేలా చేస్తున్నారు. అందువల్లే ఈ షో ఆదరణను పొందుతోంది.