రాత్రి పూట.. హీరోల గ‌దుల‌కు వెళ్లే అలవాటు నాకు లేదు: కంగనా ర‌నౌత్

విధాత: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుక‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కలిసి స్టేజి మీద డాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్ తాజాగా కొన్ని సెటైర్లు పేల్చింది. ఆమె మాట్లాడుతూ ఓ విషయం గమనించండి.. ‘నావల్ల నా తల్లి సంపన్నురాలు కాదు. నేను వ్యాపార వేత్తలు ఉన్న కుటుంబం నుండి వచ్చాను. కానీ మా […]

  • By: krs    latest    Mar 01, 2023 1:25 AM IST
రాత్రి పూట.. హీరోల గ‌దుల‌కు వెళ్లే అలవాటు నాకు లేదు: కంగనా ర‌నౌత్

విధాత: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుక‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కలిసి స్టేజి మీద డాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్ తాజాగా కొన్ని సెటైర్లు పేల్చింది.

ఆమె మాట్లాడుతూ ఓ విషయం గమనించండి.. ‘నావల్ల నా తల్లి సంపన్నురాలు కాదు. నేను వ్యాపార వేత్తలు ఉన్న కుటుంబం నుండి వచ్చాను. కానీ మా అమ్మ 25 ఏళ్లుగా టీచర్‌గా పని చేస్తుంది. బాలీవుడ్ అనేది ఓ మాఫియా. ఈ మాఫియా పై నేనుఎదురు తిరుగుతున్నాను.

నేను ముసిముసి నవ్వులు నవ్వుతూ.. ఐటెం సాంగ్స్.. పెళ్లిళ్లలో డాన్సులు.. రాత్రి పూట హీరోల గ‌దుల‌కు వెళ్లడం వంటి పనులు చేయను.. చేయలేను. అందుకే నాపై పిచ్చిది అనే ముద్ర వేసి న‌న్ను పిచ్చిదాన్ని చేశారు. వారి ఆధిప‌త్యానికి ఎదురు తిరిగిన వారిని వీలుంటే చంపుతారు. లేదంటే నాపై వేసిన‌ట్లు పిచ్చిది అని ముద్ర వేస్తారు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

ఇక కంగ‌నా రౌన‌త్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇటీవల తల్లి ఓ పొలంలో పనిచేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తల్లి ఓ బాలీవుడ్ హీరోయిన్‌కి త‌ల్లి అయినప్పటికీ.. నేటికీ వ్యవసాయం చేస్తూ తన అభిరుచి చాటుకుంటుందని తెలిపారు.

ఈ పోస్ట్ వైరల్ అవ్వగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ఓ నెటిజన్ లక్షాధికారి అయిన తర్వాత కూడా కంగనా తల్లి పొలంలో పనిచేస్తుంది.. ఆమె ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తుంది.. అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం కంగనా కామెంట్స్, ఆమె షేర్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.